ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న ట్రైన్ వీడియో.. ఈ కుక్క కూడా వేడుక చూసేందుకు వచ్చి..!

ABN, First Publish Date - 2023-07-22T17:29:48+05:30

ముంబై లోకల్ ట్రైన్ అనగానే చాలా మందికి మొదటగా గుర్తుకు వచ్చేది ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన కోచ్‌లు. ఉద్యోగాల కోసం, చదువుల కోసం ప్రయాణికులు ఒక చోట నంచి మరో చోటుకు వెళ్లేందుకు ఎక్కువగా లోకల్ రైళ్లనే ఆశ్రయిస్తారు. దాంతో ఆ రైళ్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటాయి.

ముంబై లోకల్ ట్రైన్ (Mumbai Local Train) అనగానే చాలా మందికి మొదటగా గుర్తుకు వచ్చేది ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన కోచ్‌లు. ఉద్యోగాల కోసం, చదువుల కోసం ప్రయాణికులు ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ఎక్కువగా లోకల్ రైళ్లనే ఆశ్రయిస్తారు. దాంతో ఆ రైళ్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి నిల్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటాయి. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ మెట్రో రైలుకు సంబంధించిన వీడియో వైరల్ (Viral Video) అవుతోంది.

@mumbaimatterz అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మెట్రో రైలు (Mumbai Metro) సబర్బన్ దహిసర్ వద్ద ప్రయాణికులతో నిండిపోయి ఉంది. డోర్ వరకు ప్యాసింజర్లు ఉండడంతో ఆటోమేటిక్‌గా మూసుకోవాల్సిన ఆ రైలు డోర్లు మూసుకోవడం లేదు. పలుసార్లు ఆ డోర్లు దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం కనిపిస్తోంది. ఇంతలో ఓ కానిస్టేబుల్ అక్కడకు వచ్చి పాసింజర్లను బలవంతంగా లోపలికి నెట్టాడు. దాంతో డోర్లు మూసుకున్నాయి. ఈ తతంగం మొత్తాన్ని ఓ వీధి కుక్క (Dog) దగ్గరుండి గమనించింది.

Viral Video: ఆర్టీసీ బస్సులో అరుదైన దృశ్యం.. ఒకటికి రెండు సీట్లను ఆక్రమించుకుని నిద్రపోతున్న శునకం నిద్రపోతోంటే..!

``లోకల్ ట్రైన్ సీన్‌ను చూసేందుకు ఓ వీధి కుక్క కూడా వచ్చింది`` అని పేర్కొంటూ ఈ (Funny Video) వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఆ కుక్క ఎంత ఆసక్తిగా చూస్తోందో``, ``ముంబై వాసుల పరిస్థితి ఎప్పటికీ మెరుగుపడదు``, ``వేరే ఛాయిస్ లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-22T17:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising