ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WhatsApp groups: ఎవరు పడితే వాళ్లు వాట్సప్ గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తున్నారా..? ఈ ట్రిక్‌ను కనుక వాడితే..!

ABN, First Publish Date - 2023-11-04T11:44:36+05:30

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'వాట్సప్ గ్రూప్స్' (WhatsApp groups) ఫీచర్ గురించి తెలిసిందే. ఒకేసారి పలువురు స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండటానికి సులభమైన మార్గాలలో 'వాట్సప్ గ్రూప్స్' ఒకటి. కానీ, కొన్నిసార్లు మనకు తెలియని వ్యక్తులు మన అనుమతి లేకుండానే మనల్ని కొన్ని గ్రూప్స్‌లో జాయిన్ చేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

WhatsApp groups: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'వాట్సప్ గ్రూప్స్' (WhatsApp groups) ఫీచర్ గురించి తెలిసిందే. ఒకేసారి పలువురు స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండటానికి సులభమైన మార్గాలలో 'వాట్సప్ గ్రూప్స్' ఒకటి. కానీ, కొన్నిసార్లు మనకు తెలియని వ్యక్తులు మన అనుమతి లేకుండానే మనల్ని కొన్ని గ్రూప్స్‌లో జాయిన్ చేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా సార్లు తెలియని వ్యక్తులు అసలు పరిచయంలేని గ్రూపులో మనల్ని జాయిన్ చేసి, చాటింగ్ ప్రారంభిస్తారు. ఇది చాలా మంది వాట్సప్ వినియోగదారులు ఎదుర్కొన్న సమస్య. ఈ సమస్యకు వాట్సప్ మాతృసంస్థ 'మెటా' (Meta) ఒక చక్కటి పరిష్కారం చూపించింది. వినియోగదారులు అప్‌గ్రేడ్ చేసిన సెక్యూరిటీ ఫీచర్‌ ద్వారా చిన్న ప్రైవసీ సెట్టింగ్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని తెలిపింది. ఇప్పటికే ఈ గ్రూపు ప్రైవసీ సెట్టింగ్స్ అనేది ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ డివైజ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది మెటా. ముందుగా మీరు వాడుతున్న వాట్సప్ అప్‌డేటేడ్ వెర్షన్ ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత కింది సింపుల్ స్టేప్స్ ద్వారా ప్రైవసీ సెట్టింగ్ సెట్ చేసుకోవచ్చు.

Viral Video: చేత్తో ఇటుకను పట్టుకుని మరీ భార్యాభర్తల మధ్య బిగ్ ఫైటింగ్.. వీడియోను చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!

ఆండ్రాయిడ్ యూజర్లకు గ్రూప్స్ ప్రైవసీ సెట్టింగ్ ఇలా...

* ముందుగా మన మొబైల్‌లో వాట్సప్ ఓపెన్ చేయాలి

* ఆ తర్వాత పైన ఉండే మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

* సెట్టింగ్స్‌లో ప్రైవసీని ఎంచుకుని కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్లి, గ్రూప్స్‌పై క్లిక్ చేయాలి

* గ్రూప్స్‌పై క్లిక్ చేయగానే మనకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.

'ఎవ్రీవన్', 'మై కాంటాక్ట్స్', 'మై కాంటాక్ట్స్ ఎక్స్‌సెప్ట్' అని. ఇందులో ఎవ్రీవన్ అనేది మన ఫోన్‌లో సేవ్ ఉన్న ప్రతి కాంటాక్ట్‌ను మనల్ని గ్రూప్స్‌లో జాయిన్ చేయడానికి అనుమతి ఇస్తుంది. ఇక 'మై కాంటాక్ట్స్' అనేది ఓన్లీ మన కాంటాక్ట్లనే గ్రూప్ జాయినింగ్‌కి పర్మిషన్ ఇస్తుంది. అలాగే చివరిదైన 'మై కాంటాక్ట్స్ ఎక్స్‌సెప్ట్' మనం ఎంపిక చేసిన కాంటాక్ట్లను మాత్రమే మనల్ని వాట్సప్ గ్రూప్స్‌లో జాయినింగ్‌కు అనుమతి ఇస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా మనకు పరిచయం లేని వ్యక్తులు మనల్ని ఏదైనా వాట్సప్ గ్రూపులో జాయిన్ చేయాలంటే తప్పనిసరిగా అప్రూవల్ కావాల్సిందే. అలా మనకు గ్రూప్ జాయినింగ్ కోసం రిక్వెస్ట్ వచ్చిన మూడు రోజుల్లో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా తిరస్కరించవచ్చు.

YouTube: మొత్తానికి యూట్యూబ్ భలే షాకిచ్చిందిగా.. యాడ్స్ రాకుండా టెక్నిక్స్ వాడే వాళ్లకు..!

Updated Date - 2023-11-04T11:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising