ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: భార్యాభర్తల మాస్టర్‌ప్లాన్.. సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఓ యువకుడిని ఇంటికి పిలిచారు.. కళ్లకు గంతలు కట్టి మరీ వాళ్ల నిర్వాకమిదీ..!

ABN, First Publish Date - 2023-03-31T17:32:24+05:30

కొంత మంది చనువును అలుసుగా తీసుకుంటారు. మరికొందరు నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. స్నేహితుడే కదా? అని ఇంటికి తీసుకెళ్లాడా వ్యక్తి. ఆ ప్రబుద్ధుడు మాత్రం వక్రబుద్ధి చూపించాడు. అంతే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తామంటూ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత

Crime News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొంత మంది చనువును అలుసుగా తీసుకుంటారు. మరికొందరు నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. స్నేహితుడే కదా? అని ఇంటికి తీసుకెళ్లాడా వ్యక్తి. ఆ ప్రబుద్ధుడు మాత్రం వక్రబుద్ధి చూపించాడు. అంతే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తామంటూ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

మహ్మద్‌ మీరజ్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌ ఇద్దరూ స్నేహితులు. స్నేహితుడే కదా? అని ఇమ్రాన్‌.. మీరజ్‌ను ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడు. ఇలా తరుచుగా ఇంటికి రావడంతో ఇమ్రాన్‌ భార్యతో పరిచయం ఏర్పడింది. తరుచుగా వస్తూ ఇమ్రాన్ భార్యను వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు హెచ్చరించినా మీరజ్ వినకపోవడంతో చంపేశాడు. ఈ సంఘటన గుజరాత్‌ (Gujarat) రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Girlfriend: అమ్మ బాబోయ్.. ఈ అమ్మాయి మామూలు కిలేడీ కాదు.. ప్రియుడి కోసం మాస్టర్‌ ప్లాన్.. అచ్చం తనలాగే ఉన్న యువతిని రప్పించి..

బాపూనగర్‌లో నివసించే మహ్మద్‌ మీరజ్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌ స్నేహితులు. ఇమ్రాన్‌ కోసం మీరజ్‌ అతని ఇంటికి వెళ్లేవాడు. ఇలా వస్తున్న క్రమంలో మిత్రుడి భార్యను తరుచూ వేధించేవాడు. దీనిపై ఆగ్రహించిన ఇమ్రాన్‌ పలుమార్లు హెచ్చరించినా మీరజ్‌ తీరు మార్చుకోకపోవడంతో అతడ్ని చంపాలని పథకం రచించాడు. మీరజ్‌ను ఇంటికి పిలిచి ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ (surprise gift) ఇస్తామంటూ కళ్లకు గంతలు కట్టి ఇమ్రాన్‌ దంపతులిద్దరూ మీరజ్‌ను కత్తితో పొడిచి హతమార్చారు. అనంతరం ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకుండా శరీరాన్ని ముక్కలు.. ముక్కలుగా చేసి చెత్తకుప్పలో పడేశారు. ఇదిలా ఉంటే తమ కుమారుడు కనిపించడం లేదంటూ మీరజ్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఇమ్రాన్‌పై అనుమానం వచ్చి ప్రశ్నిస్తే.. అసలు విషయం బయటపడింది. నిందితులిద్దర్నీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ఇది కూడా చదవండి: Money: సినిమాలో చూపించింది మక్కీకి మక్కీ అమలు చేశారు.. 47 లక్షల రూపాయలను కొల్లగొట్టేశారు.. కానీ ఒక్క క్లూ‌తో..

Updated Date - 2023-03-31T17:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising