Viral: వివాహమైన మరుసటి రోజే వధువుకు ఊహించని సమస్య.. శోభనం గదిలోకి సోదరుడితో కలిసి వెళ్లిన భర్త.. చివరకు..
ABN, First Publish Date - 2023-07-23T21:47:35+05:30
తమ కూతురు జీవితం బాగుండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. వివాహానంతరం సంతోషంగా అత్తగారింటికి సాగనంపారు. అయితే ఆ సంతోషం ఎంతో సమయం నిలవదని వారు ఊహించలేకపోయారు. వివాహమైన మరుసటి రోజే...
తమ కూతురు జీవితం బాగుండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. వివాహానంతరం సంతోషంగా అత్తగారింటికి సాగనంపారు. అయితే ఆ సంతోషం ఎంతో సమయం నిలవదని వారు ఊహించలేకపోయారు. వివాహమైన మరుసటి రోజే వధువుకు ఊహించని సమస్య వచ్చి పడింది. శోభనం గదిలోకి భర్త తన సోదరుడితో రావడం చూసి షాక్ అయింది. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) అల్వార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువతికి (young woman) ఖిలోరా ప్రాంతానికి చెందిన యువకుడితో జూన్ 11న వివాహమైంది. తమ కూతురు భర్తతో సంతోషంగా ఉంటుందని తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. అయితే సంతోషం ఎంతో సమయం ఉండదని ఊహించలేకపోయారు. వివాహమైన మరుసటి రోజే.. నవ వధువుకు (bride) ఊహించని సమస్య వచ్చి పడింది. శోభనం గదిలోకి తన భర్త సోదరుడితో కలిసి రావడంతో ఆమె షాక్ అయింది. ఇదేంటని అతన్ని నిలదీయడంతో దాడి చేశాడు.
తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ‘‘దయచేసి నన్ను వదిలిపెట్టండి’’.. అని వేడుకుంటున్నా వినకుండా రాక్షసంగా ప్రవర్తించారు. మరుసటి రోజు ఈ విషయాన్ని అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదు. పైగా ఎవరూ లేని సమయంలో ఆమె మామ కూడా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. రెండో రోజు కూడా భర్త, అతడి సోదరుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. చివరకు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలితో విచారించారు. ఆమె ఫిర్యాదు మేరకు.. యువతి భర్త, అతడి సోదరుడు, అత్తమామలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
Updated Date - 2023-07-23T21:47:35+05:30 IST