ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

ABN, First Publish Date - 2023-03-02T17:26:03+05:30

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా డబులైంది. ఆ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) నటన, మ్యానరిజం

Icon Star Allu Arjun
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా డబులైంది. ఆ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) నటన, మ్యానరిజం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ సినిమాతో నార్త్ ఇండియాలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాయించుకున్నాడు అల్లు అర్జున్‌. ఇక అభిమానులైతే ఆయనని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా (King of Social Media) అని పిలుచుకుంటారు. ఆ పేరుకి తగినట్లే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తగ్గేదే లే అన్నట్లుగా ఐకాన్ స్టార్ దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోయర్స్‌ను కలిగియున్న సౌత్ హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు.

సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని చాటుతూ.. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోకి లేని రికార్డ్‌ను బన్నీ సాధించారు. ప్రస్తుతం ఆయనను 20 మిలియన్స్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు. ఆయన రెగ్యులర్‌గా పోస్ట్‌లు చేయకపోయినా.. ఈ మైలురాయిని అందుకోవడం చూస్తుంటే.. బన్నీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అటు ఫ్యామిలీకి.. ఇటు తన అభిమానుల అభిమానానికి చాలా విలువనిస్తారనేది తెలియంది కాదు. వృత్తిపరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ ఆయన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్‌లు చేస్తుంటారు. తన భార్య స్నేహ (Sneha) మరియు పిల్లలు అయాన్, అర్హాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసుకుంటూ.. అభిమానులకు దగ్గరగా ఉంటుంటారు. ఇంకా చెప్పాలంటే ఆయనకొక ఆర్మీనే (Allu Army) ఉంది.

ప్రస్తుతం సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప: ది రైజ్’ (Pushpa The Rise)కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘పుష్ప: ది రూల్’ (Pushpa The Rule) చిత్రీకరణలో బన్నీ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ అయిన పుష్పరాజ్ పాత్రను ఆయన పోషించారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాలకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్‌డేట్ రాలేదు. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్‌తో ఆల్రెడీ కథలు ఓకే అయినట్లుగా అయితే తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

* Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

* Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

* Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

* Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

Updated Date - 2023-03-02T17:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!