ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Railway: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాదండోయ్.. రైల్వే శాఖకు కాసులు కురిపిస్తున్న 5 ట్రైన్ల లిస్ట్ ఇదే..!

ABN, First Publish Date - 2023-11-09T19:43:14+05:30

ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా అవతరించిన భారతీయ రైల్వే.. ఎంతో మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. అలాగే అనేక రకాల సరుకులను కూడా రావాణా చేస్తుంటుంది. ఈ క్రమంలో కొత్తగా..

ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా అవతరించిన భారతీయ రైల్వే.. ఎంతో మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. అలాగే అనేక రకాల సరుకులను కూడా రావాణా చేస్తుంటుంది. ఈ క్రమంలో కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో రైల్వేకి ఆదాయం కూడా అంతే స్థాయిలో వస్తుంటుంది. అయితే భారతీయ రైల్వేకి కేవలం ఐదు రైళ్ల ద్వారా మాత్రమే అధిక ఆదాయం వస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవును.. మీరు విన్నది నిజమే.. ఈ 5 రైళ్ల ద్వారానే ద్వారానే ఇండియన్ రైల్వే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. ఇంతకీ ఆ రైళ్లు ఏంటో, ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుందాం..

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రోజూ 22,593 రైళ్లను నడుపుతోంది. ఇందులో 13,452 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని రైళ్లలో తక్కువ మంది ప్రయాణికులతో వెళ్తుంటే.. మరికొన్ని రైళ్లు ఏడాది పొడవునా రద్దీగా నడుస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5 రైళ్లు మాత్రం అత్యంత రద్దీగా నడుస్తుంటాయి. దీంతో వాటి ద్వారా ఆదాయం కూడా అంతే స్థాయిలో వస్తుంటుంది. వాటి వివరాలు వరుసగా ఇలా ఉన్నాయి..

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్..

బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ( రైలు నంబర్ 22692).. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు వరకూ నడుస్తుంది. ఈ రైలు ద్వారా భారతీయ రైల్వేకి అధిక ఆదాయం వస్తుంటుంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు ద్వారా రూ.176 కోట్ల ఆదాయం వచ్చింది.

సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్..

న్యూఢిల్లీ మీదుగా కోల్‌కతా వెళ్లే సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా కూడా అదాయం ఎక్కువగా వస్తోంది. ఈ రైలు ద్వారా 2022- 23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకి రూ.128 కోట్ల ఆదాయం వచ్చింది.

న్యూఢిల్లీ- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్..

న్యూఢిల్లీ నుంచి దిబ్రూఘర్ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఆదాయపరంగా మూడో స్థానంలో ఉంది. ఈ రైలు ద్వారా ఇండియన్ రైల్వేకి 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.126కోట్ల ఆదాయం వచ్చింది.

ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్..

న్యూఢిల్లీ, ముంబై మధ్య నడిచే ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా కూడా భారతీయ రైల్వేకి అత్యధిక ఆదాయం వస్తోంది. ఈ రైలు ద్వారా 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.122 కోట్ల ఆదాయం వచ్చింది.

దిబ్రూగర్ రాజధాని ఎక్స్‌ప్రెస్

దిబ్రూగర్ టౌన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా కూడా ఇండియన్ రైల్వేకి అత్యధిక ఆదాయం వస్తోంది. ఈ రైలు ద్వారా 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.116 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

Updated Date - 2023-11-09T19:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising