ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Human Dog: పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ‘కుక్క’ మనిషి.. ఆలూ లేదు చూలూ లేదు.. అంతా హాంబక్

ABN, First Publish Date - 2023-08-13T19:55:03+05:30

జపాన్‌కి చెందిన ఒక వ్యక్తి కుక్కగా మారిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కుక్కలంటే అమితమైన ఇష్టమున్న టోకో అనే వ్యక్తి.. చిన్నప్పటి నుంచే కుక్కగా మారాలని అనుకున్నాడు. ఎట్టకేలకు పెద్దయ్యాక..

జపాన్‌కి చెందిన ఒక వ్యక్తి కుక్కగా మారిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కుక్కలంటే అమితమైన ఇష్టమున్న టోకో అనే వ్యక్తి.. చిన్నప్పటి నుంచే కుక్కగా మారాలని అనుకున్నాడు. ఎట్టకేలకు పెద్దయ్యాక.. అక్షరాల రూ.16 లక్షలు ఖర్చు పెట్టి మరీ కుక్కగా రూపాంతరం చెందాడు. వీధుల్లో తిరుగుతూ.. జనాల్ని ఆటపట్టించడంతో పాటు నిజమైన కుక్కలతో స్నేహం కూడా చేశాడు. అసలు అతడు కుక్కగా మారినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని గురించి ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. కుక్కల మీద ఉన్న ప్రేమ కారణంగా.. అతడు జీవితాంతం కుక్కగానే బతకాలని అనుకుంటున్నాడన్నదే ఆ వార్త సారాంశం.


అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా టోకో సమాధానమిచ్చాడు. తాను జీవితాంతం కుక్కగానే ఉండాలని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నాడు. తాను కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఈ కుక్క దుస్తుల్ని ధరిస్తానని, అది కూడా కేవలం ఇంట్లో ఉన్నప్పుడే మాత్రమే వేసుకుంటానని తెలిపాడు. తనకు కుక్కలంటే ఇష్టం కావడంతో, కుక్కలాగా మారాలని అనుకున్నానే తప్ప.. లైఫ్‌లాంగ్ కుక్కలాగే ఉండాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న తన వీడియో ఇప్పుడు తీసింది కాదని, గతేడాది తీశానని తెలిపాడు. తన వీడియోకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని చెప్పాడు. తనకు ఆ కుక్క దుస్తుల్లోనే లైఫ్‌లాంగ్ ఉండాలన్న ఆసక్తి లేదని, వారానికి ఓసారి మాత్రమే వేసుకుంటానంటూ టోకో మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలావుండగా.. ప్రతిఒక్కరికీ తమకంటూ ఒక అభిరుచి ఉంటుందన్నట్టు, టోకోకి కుక్కలాగా రూపాంతరం చెందాలని ఉండేది. అయితే.. అది అంత ఈజీ కాదని తెలిసి, ముందుగా డబ్బులు సంపాదించడంపై దృష్టి సారించాడు. మొత్తానికి కొంత డబ్బు జమ చేసి.. జెపెట్ అనే ఓ సంస్థను సంప్రదించాడు. తనకు కుక్కలాంటి దుస్తులు తయారు చేయమని ఆర్డర్ ఇవ్వగా.. వాళ్లు కొన్ని వారాల పాటు కష్టపడి, దుస్తుల్ని రెడీ చేసి ఇచ్చాడు. ఈ కుక్క దుస్తులు అందగానే.. ఫోటోలకు పోజులివ్వడంతో పాటు పలు వీడియోలు తీసి సోసల్ మీడియాలో వదిలాడు. ఒక వీడియోలో అతడు కుక్కలతో స్నేహం చేయడాన్ని కూడా గమనించవచ్చు.

Updated Date - 2023-08-13T19:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising