Viral Video: మీ పిల్లలు జెల్లీలు తింటుంటారా? అయితే జాగ్రత్త.. అవి ఎలా తయారవుతాయో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-08-21T13:43:16+05:30
రాణా దుకాణాలలో దొరికే జెల్లీ ఫ్రూట్స్‌ను తినేందుకు చాలా మంది పిల్లలు ఇష్టపడతారు. ఆ ప్లాస్టిక్ కవర్లలో ఉండే తియ్యటి రసాన్ని చివరి చుక్క వరకు పీలుస్తుంటారు. చాలా రుచికరంగా అనిపించే ఆ జెల్లీలను కొనుక్కునేందుకు పిల్లలు ఎగబడతారు. అయితే ఆ జెల్లీలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా?
కిరాణా దుకాణాలలో దొరికే జెల్లీ ఫ్రూట్స్ (Jelly Fruits)ను తినేందుకు చాలా మంది పిల్లలు ఇష్టపడతారు. ఆ ప్లాస్టిక్ కవర్లలో ఉండే తియ్యటి రసాన్ని చివరి చుక్క వరకు పీలుస్తుంటారు. చాలా రుచికరంగా అనిపించే ఆ జెల్లీలను కొనుక్కునేందుకు పిల్లలు ఎగబడతారు. అయితే ఆ జెల్లీలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా? జెల్లీలను తయారు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
reelsyemegim అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే మీ పిల్లలను జెల్లీలకు దూరంగా ఉంచడానికి కచ్చితంగా ప్రయత్నిస్తారు. ఓ మెషిన్ ద్వారా ప్లాస్టిక్ కేసింగ్‌లను కృత్రిమంగా రంగులు కలిపిన ఆరెంజ్ ఫ్లేవర్ ద్రవంతో నింపుతున్నారు. ఆ తర్వాత ప్లాస్టిక్ (Plastic) క్యాన్‌ల మూతలను బిగించి ప్రాసెస్ చేస్తున్నారు. చివరకు ఆ ద్రవం చిక్కని జెల్లీగా మారి బయటకు వస్తోంది. ఆ వీడియో చూసిన వారు జెల్లీలు తయారయ్యే తీరు చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు (Jelly Fruits making Video).
Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కొండపై నుంచి కిందకు ఎలా పడ్డారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.6 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``సన్నని పొర లాంటి ప్లాస్టిక్ క్యాన్‌లలో విషం``, ``ఈ జెల్లీలు తింటే ప్లాస్టిక్ తిన్నట్టే``, ``పిల్లల పొట్టల్లోకి మైక్రో ప్లాస్టిక్‌ను పంపుతున్నాం``, ``ఇలాంటి వాటిని బ్యాన్ చేయాలి`` అంటూ నెటజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-21T13:43:16+05:30 IST