ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shimla Railway Track: గాల్లో తేలుతున్న రైల్వే ట్రాక్.. వర్షాల ధాటికి కొట్టుకుపోయిన భూభాగం

ABN, First Publish Date - 2023-08-17T18:41:40+05:30

ఫ్యాంటసీ సినిమాల్లో రైళ్లు, పెద్ద పెద్ద వాహనాలు గాల్లో తేలడం చూసే ఉంటారు. కానీ.. రియల్ లైఫ్‌లో రైల్వే ట్రాక్ గాల్లో తేలడం ఎప్పుడైనా చూశారు. ఈ అరుదైన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో...

ఫ్యాంటసీ సినిమాల్లో రైళ్లు, పెద్ద పెద్ద వాహనాలు గాల్లో తేలడం చూసే ఉంటారు. కానీ.. రియల్ లైఫ్‌లో రైల్వే ట్రాక్ గాల్లో తేలడం ఎప్పుడైనా చూశారు. ఈ అరుదైన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో చోటు చేసుకుంది. అక్కడ కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగానే.. అక్కడ రైల్వే ట్రాక్ గాల్లో తేలాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల ధాటికి ఆ ట్రాక్ కింద ఉన్న భూభాగం మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో.. రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతోంది. అయితే.. ఇది రెగ్యులర్‌గా ప్రయాణికులు ప్రయాణించే సాధారణ రైల్వే ట్రాక్ కాదులెండి. పర్యాటకం కోసం యునెస్కో వారు ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్. దీనిపై కేవలం టాయ్ ట్రైన్ మాత్రమే ప్రయాణిస్తుంది.


హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతాల్లో షిమ్లా సమ్మర్ హిల్ ఒకటి. దీని మార్గం ద్వారా ఆ రైల్వే ట్రాక్ వెళ్తుంది. కక్లా అనే ప్రాంతం నుంచి మొదలుకొని.. ఆ హిల్ మార్గం ద్వారా టాయ్ ట్రైన్ షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం ఐదు గంటల పాటు సాగుతుంది. అయితే.. అక్కడ వర్షాలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఈ ట్రాక్ గాల్లో తేలుతుండటంతో, ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకల్ని అధికారులు ఆపేశారు. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని, పనులు పూర్తవ్వడానికి నెల రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ రైల్వే ట్రాక్‌తో పాటు షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో ఉన్న ఒక దేవాలయం సైతం కూలిపోయింది. ఆ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ ఘటనలో శిథిలాల కింద 13 మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇదిలావుండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రమంతా అతలాకుతలమైంది. రహదారులన్నీ వరద నీరుతో నిండిపోవడంతో వాహనదారులకు అంతరాయం కలుగుతోంది. కొండ ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటంతో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకూ ఈ వర్షాల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తినష్టం వాటిల్లింది కూడా! ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని, అందుకు ఏడాదికి పైగా సమయం పడుతుందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు.

Updated Date - 2023-08-17T18:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising