Kangana Ranaut: దిగజారి అక్కడ అలా డ్యాన్సులు చేస్తారు.. బాలీవుడ్ స్టార్స్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఫైర్‌బ్రాండ్
ABN, First Publish Date - 2023-02-27T11:21:57+05:30
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు వరుసగా లేడీ ఓరియెంటేడ్ చిత్రాలు చేస్తూ బీ టౌన్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు వరుసగా లేడీ ఓరియెంటేడ్ చిత్రాలు చేస్తూ బీ టౌన్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ భామ ఇటీవలే తన తల్లి ఓ పొలంలో పని చేస్తున్న పిక్‌ని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు దానిపై కామెంట్స్ చేశారు.
ఓ నెటిజన్ అయితే.. ‘లక్షాధికారి అయిన తర్వాత కూడా.. కంగనా తల్లి పొలంలో పని చేస్తోంది. ఆమె చాలా సింప్లిసిటీతో ఉన్నారు’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కి వెంటనే కంగనా స్పందిస్తూ రిప్లై ఇచ్చింది. అందులో.. ‘దయచేసి ఓ విషయం గమనించండి. నా సంపాదన వల్ల నా తల్లి ధనవంతురాలు కాదు. నేను పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. కానీ మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్‌గా పని చేసింది. సినిమా మాఫియాపై నేను రియాక్టయ్యే తీరుకి కారణం ఆమెనే. అందుకే కొందరు నటులలాగా నేను పెళ్లిళ్లలో చీప్‌గా డ్యాన్స్ గట్రా చేయలేను’ అని రాసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’
అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో సైతం.. ‘చెత్త మూవీ మాఫియా చిల్లర డబ్బు కోసం ఛీప్‌గా పెళ్లిలో డ్యాన్సులు చేస్తుంటుంది. అలాంటి వారికి నిజమైన వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం అంటే ఏంటో తెలియదు. అందుకే నేను అలాంటి వారికి ఎప్పటికీ గౌరవం ఇవ్వను’ అని పేర్కొంది.
కాగా.. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar) కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కంగనా పైవిధంగా సెటైర్లు వేసింది.
Updated Date - 2023-02-27T11:21:58+05:30 IST