ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KVishwanath షాట్‌కి అంతా రెడీ... ఆ స్క్రిప్ట్ పడేశారు...

ABN, First Publish Date - 2023-02-03T18:55:39+05:30

రాధికకు పెద్ద కట్ట స్క్రిప్ట్ ఇచ్చారు. దాని నిండా యాక్టర్ల మధ్య నడవాల్సిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. చాలా గంభీరంగా సాగే ఈ సీన్‌లో

Director K Viswanath and Radhika
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది కమల్ హాసన్, రాధికల సూపర్ హిట్ చిత్రం స్వాతిముత్యం షూటింగ్ స్పాట్...

రామాలయంలో సీతారామకళ్యాణం జరుగుతుండగా శివయ్య (కమలహాసన్) పంతులుగారి చేతిలోంచి తాళి లాక్కుని వితంతువైన లలిత (రాధిక) మెడలో కట్టేశాడు. అక్కడున్నవాళ్లు బిత్తరపోయి చూస్తుండగా, అక్కడ ఉండలేక కొడుకుతో కలిసి ఇంటికి వెళ్లిపోయిన లలితను శివయ్య తనింటికి తీసుకెళతాడు. అక్కడ శివయ్య నాయనమ్మ (నిర్మలమ్మ) తన అల్లుడి (సుత్తి వీరభద్రరావు) దగ్గరున్న శివయ్య ఆస్తిపత్రాలు, డబ్బు తిరిగిమ్మని అడుగుతుంది. అవి ఇవ్వనన్న ఆ అల్లుడిపై శివయ్య తిరగబడటంతో అతను శివయ్యను కర్రతో చావగొడుతుంటాడు. అప్పుడు లలిత అతనికి అడ్డుపడి, ఆ కర్ర లాక్కుని శివయ్య చేతిలో పెట్టి... ఒక్క మాట కూడా మాట్లాడకుండా శివయ్యను మెల్లగా ముందుకు తోస్తుంది. ఆ కర్రతో అతనికి అదే లెవెల్ కోటింగ్ ఇస్తాడు శివయ్య. ఇక్కడ సీన్ కట్ చేద్దాం...

విశ్వనాథ్ ఈ సీన్ తియ్యడానికి ముందు... యూనిట్ వాళ్లు ఆ సీన్ కోసం లలిత పాత్రధారి రాధిక చేతికి పెద్ద స్క్రిప్ట్ ఇచ్చారు. దాని నిండా పైన చెప్పుకున్న సీన్‌లోని యాక్టర్ల మధ్య నడవాల్సిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. చాలా గంభీరంగా సాగే ఈ సీన్‌లోని ఆ డైలాగ్స్ చెప్పడానికి కమల్, రాధిక, నిర్మలమ్మ, వరలక్ష్మి, సుత్తివీరభధ్రరావు ఇలా అందరూ రెడీగా ఉన్నారు. ఇక షాట్ తియ్యడమే ఆలస్యం. విశ్వనాథ్ ఆ స్క్రిప్ట్ తీసుకుని డైలాగ్స్ అన్నీ చూశారు. షాట్ తియ్యడానికి ముందు కాసేపు అలా కూర్చుని తల ఊపుతూ ఆలోచించారు. "ఓకే షూట్ చేద్దాం... కానీ, ఈ సీన్ వద్దంటూ అందరూ సిద్ధంగా ఉన్న ఆ సీన్ స్క్రిప్ట్ బండిల్ పక్కన పడేశారు. ఆయన చేస్తోంది చూసి యూనిట్ అంతా షాక్...

రాధికని విశ్వనాథ్ పిలిచి.... "నువ్వేం మాట్లాడకు, లలిత పాత్రకుండే పంతం, మొండితనం, మానసిక బలం ఈ సీన్‌లో పండాలి. అందుకని, ఒక్క మాట కూడా లేకుండా ఇలా చెయ్యి అంటూ పైన చెప్పిన ప్రకారం ఆ సీన్ చెయ్యమన్నారు.... అంటే, సుత్తి వీరభద్రరావు నుంచి రాధిక కర్ర లాక్కోవడం... ఒక్క మాట కూడా మాట్లాడకుండా శివయ్య చేతికి ఆ కర్ర ఇచ్చి, అతన్ని ముందుకు నెట్టడం... ఆ కర్రతో తనకి మావయ్య వరుసయ్యే వీరభద్రరావుకి శివయ్య అదే లెవెల్‌లో కోటింగ్ ఇవ్వడం టకటకా జరిగిపోయాయి. ఆ సీన్ ఎంతగా పండిందో అందరికీ తెలుసంటూ స్వాతిముత్యం చిత్రం విడుదలై 36 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నటి రాధిక మీడియాతో ఆ విశేషాలు పంచుకున్నారు.

దివికేగిన మేలిముత్యం, దర్శక దిగ్గజం, కళాతపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ ప్రతిభకి ఇదొక 'మెచ్చు'తునక.

Updated Date - 2023-02-03T23:11:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising