Lions Viral Video: పొద్దున్నే గుడికి వెళ్లిన పూజారి.. సడన్గా సింహాలు ఎంట్రీ.. అవి భయపడి పారిపోవాలని అతడేం చేశాడో చూస్తే..!
ABN, First Publish Date - 2023-07-28T15:52:06+05:30
సింహాలు, పులులు మొదలైన వన్య మృగాలను చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. వాటిని తలుచుకుంటే చాలా గుండె గుభేల్మంటుంది. వాటి గర్జన కూడా అతి భయంకరంగా ఉంటుంది. అలాంటిది సింహం అతి దగ్గరగా వచ్చి గాండ్రిస్తే ఎలా ఉంటుంది. ఓ గుడిలో పూజారికి అలాంటి అనుభవమే ఎదురైంది.
సింహాలు (Lions), పులులు (Tigers) మొదలైన వన్య మృగాలను చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. వాటిని తలుచుకుంటే చాలా గుండె గుభేల్మంటుంది. వాటి గర్జన కూడా అతి భయంకరంగా ఉంటుంది. అలాంటిది సింహం అతి దగ్గరగా వచ్చి గాండ్రిస్తే ఎలా ఉంటుంది. ఓ గుడిలో పూజారికి (Priest) అలాంటి అనుభవమే ఎదురైంది. ఉదయమే గుడికి వెళ్లిన పూజారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ పూజారి ఒక్కడే గుడిలో ఉండగా ఒకేసారి రెండు సింహాలు లోపలకి వచ్చేశాయి (Lions entered into the temple).
గుజరాత్ (Gujarat)లోని గిర్ గ్రామంలో ఉన్న పాండేశ్వర్ మహాదేవ్ ఆలయం (Temple)లోకి తెల్లవారుజాము సమయంలో రెండు సింహాలు చేరుకున్నాయి. ఆ సమయంలో పూజారి మాత్రమే గుడిలో ఉన్నాడు. అతను సింహాలను చూసిన వెంటనే తలుపు మూసివేసాడు. ఆ సింహాలను తన మొబైల్ ద్వారా వీడియో తీశాడు. ఒక సింహం నేరుగా గుడి తలుపు దగ్గరకు వచ్చి లోపలికి చూసింది. ఆ సమయంలో పూజారి బిగ్గరగా కేకలు వేశాడు. ఆ కేకలు విని సింహం వెనకడుగు వేసింది. కొద్దిసేపటికి ఆ సింహాలు బయటకు వెళ్లిపోయాయి (Lion Videos).
Viral Video: బైక్పై వెళ్తున్నారా..? ఎందుకయినా మంచిది ఒక్కసారి ఈ వీడియోను చూడండి.. రోడ్డు పక్కన కార్లు ఆగి ఉంటే..!
abhaysinh_g అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ లభించాయి. 53 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. గిర్ ప్రాంతంలో సింహాలు తరచుగా కనిపిస్తుంటాయని ఆ ప్రాంత ప్రజలు కామెంట్లు చేశారు. ఆ పూజారి ధైర్యంపై చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
Updated Date - 2023-07-28T15:52:06+05:30 IST