Viral Video: అది త్రీడీ యానిమేషన్ కాదు.. ప్రకృతిలోని అద్భుతం.. వైరల్ అవుతున్న పిడుగు పాటు వీడియో!
ABN, First Publish Date - 2023-08-06T14:06:01+05:30
ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని మనల్ని నవ్విస్తాయి, కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయి. మరికొన్ని వీడియోలో మన కళ్లని మనమే నమ్మలేనట్టుగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ (Viral Videos) అవుతుంటాయి. కొన్ని మనల్ని నవ్విస్తాయి, కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయి. మరికొన్ని వీడియోలో మన కళ్లని మనమే నమ్మలేనట్టుగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్వతంపై పిడుగు పడుతుండగా రికార్డు చేసిన వీడియో అది (Thunder storm on mountain). ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. Massimo అనే ట్విటర్ పేజీలో ఈ వీడియో షేర్ అయింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాత్రి సమయంలో ఓ పర్వతం (Mountain) కనిపిస్తోంది. కొన్ని సెకన్ల తర్వాత ఆ పర్వతంపైకి ఆకాశం నుంచి ఒక కాంతి వచ్చింది. ఆ పర్వతం పైన ఉన్న మేఘాల నుంచి మెరుపులు వచ్చి ఆ కాంతి పర్వతంపై పరావర్తనం చెందుతోంది. అది చూడడానికి మెరుపు లైటింగ్ షోలా ఉంది. ఒక్కోసారి ఆ కాంతి చెట్టులా రూపుదిద్దుకుంటోంది. మొత్తాన్ని చూడడానికి అద్భుతమైన త్రీడీ యానిమేషన్‌లా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Nature Videos).
Black Salt: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్లాక్ సాల్ట్.. దానిని తయారు చేయడానికి ఎంత శ్రమపడతారో తెలుసా?
ఇప్పటివరకు ఈ వీడియోను 7.7 లక్షల మంది వీక్షించారు. 7 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ అద్భుతమైన వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. వేలాది మంది ఈ వీడియోను రీ-ట్వీట్ చేశారు. ``పర్వతంపై మెరుపు మెరుస్తున్న దృశ్యం అద్భుతం``, ``ఇది ప్రకృతి చూపించిన అద్భుత దృశ్యం``, ``వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన కొండలపై ఉండడం ప్రమాదకరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-06T14:06:01+05:30 IST