ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: లోకల్ ట్రైన్‌లో అరుదైన దృశ్యం.. బిస్కెట్లు పంచుకుంటూ వృద్ధ జంట ప్రేమాయణం.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2023-07-23T15:51:38+05:30

ప్రేమ (Love)కు వయసుతో సంబంధం లేదు. నిజానికి వయసులో ఉన్నప్పుడు ఆడ, మగ మధ్య పుట్టేది ఆకర్షణ మాత్రమే. వయసు మళ్లాకే ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ పుడుతుంది. 20, 30 ఏళ్లు కలిసి జీవించిన తర్వాతే భార్యాభర్తల మధ్య నిజమైన అనుబంధం, ఆప్యాయత మొదలవుతాయి.

ప్రేమ (Love)కు వయసుతో సంబంధం లేదు. నిజానికి వయసులో ఉన్నప్పుడు ఆడ, మగ మధ్య పుట్టేది ఆకర్షణ మాత్రమే. వయసు మళ్లాకే ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ పుడుతుంది. 20, 30 ఏళ్లు కలిసి జీవించిన తర్వాతే భార్యాభర్తల మధ్య నిజమైన అనుబంధం, ఆప్యాయత మొదలవుతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. కోల్‌కతా లోకల్ ట్రైన్‌ (Kolkata local train)లోని ఓ వృద్ధ జంట (Elderly couple) మధ్య ఆప్యాయత సోషల్ మీడియా జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు వృద్ధ దంపతులు లోకల్ ట్రైన్‌లో కూర్చుని బిస్కెట్ల (Biscuits) ప్యాకెట్‌ను పంచుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. సీట్లో ఉన్న వ్యక్తి బిస్కెట్ ప్యాకెట్ తెరిచి పక్కనే ఉన్న తన భార్యతో పంచుకున్నాడు. అదే కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. kolkatarframe అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

Viral: ప్రియుడిని కలవడం కోసం గ్రామం మొత్తానికి కరెంట్ తీసేస్తోంది.. చివరకు ఆమె ఎలా దొరికిపోయిందంటే..

ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఎన్నో ఏళ్లుగా ఒకే వ్యక్తితో ప్రేమలో పడడం నిజంగా అద్భుతం``, ``నిజమైన ప్రేమ అంటే ఇదే``, ``వారిద్దరూ ఈ ప్రపంచాన్ని మరిచిపోయారు``, ``వారు కలిసి ఎదుర్కొన్న జీవిత కష్టాలు వారిని మరింత దగ్గర చేశాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-07-23T15:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising