Girlfriend: అమ్మ బాబోయ్.. ఈ అమ్మాయి మామూలు కిలేడీ కాదు.. ప్రియుడి కోసం మాస్టర్ ప్లాన్.. అచ్చం తనలాగే ఉన్న యువతిని రప్పించి..
ABN, First Publish Date - 2023-03-31T16:39:57+05:30
ప్రియుడి మోజులో పడి కొంత మంది కట్టుకున్న భర్తలనే కడతేర్చిన సంఘటనలు ఎన్నో చూశాం. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో జరిగిన సంఘటన గుర్తుందా? ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసిన స్వాతి సీన్ గుర్తుకొచ్చిందా? ఎవడు సినిమాలో మాదిరిగా ప్రియుడి మొఖాన్ని కాల్చి.. తన భర్త స్థానంలో రీప్లేస్ చేద్దామని స్కెచ్ వేసింది. కానీ అత్తామామలు కనిపెట్టేయడంతో ప్లాన్ బెడిసికొట్టి కటకటాల పాలైంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రియుడి మోజులో పడి కొంత మంది కట్టుకున్న భర్తలనే కడతేర్చిన సంఘటనలు ఎన్నో చూశాం. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో జరిగిన సంఘటన గుర్తుందా? ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసిన స్వాతి సీన్ గుర్తుకొచ్చిందా? ఎవడు సినిమాలో మాదిరిగా ప్రియుడి మొఖాన్ని కాల్చి.. తన భర్త స్థానంలో రీప్లేస్ చేద్దామని స్కెచ్ వేసింది. కానీ అత్తామామలు కనిపెట్టేయడంతో ప్లాన్ బెడిసికొట్టి కటకటాల పాలైంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
వారిద్దరూ ప్రేమికులు (lovers). కాలేజీ డేస్ నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. కానీ అమ్మాయి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. అంతే ఆ మాయలేడీ అచ్చం తనలాగే ఉండే స్నేహితురాల్ని చంపేసి ప్రియుడితో పారిపోయింది. 2017లో జరిగిన ఈ సంఘటన హర్యానా (Haryana) రాష్ట్రంలోని పానీపత్‌లో చోటుచేసుకుంది. పాపం పండడంతో ఆమెకు కోర్టు శిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: Money: సినిమాలో చూపించింది మక్కీకి మక్కీ అమలు చేశారు.. 47 లక్షల రూపాయలను కొల్లగొట్టేశారు.. కానీ ఒక్క క్లూతో..
జ్యోతి, కృష్ణ కాలేజీ రోజుల నుంచే ప్రేమించుకున్నారు. పెళ్లికి జ్యోతి ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదు. దీంతో ఇంట్లో నుంచి ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒకర్ని బలి తీసుకున్నారు. కుటుంబ సభ్యులకు అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో జ్యోతిలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఓ టీవీ సీరియల్ ఆధారంగా ఈ హత్యకు పథకం రచించారు. 2017 సెప్టెంబర్ 5న జ్యోతి తన స్నేహితురాలైన సిమ్రన్‌ను ఓ ప్రాంతానికి రప్పించి ఆమె చేత మత్తు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి అనంతరం గొంతు కోసి చంపేశారు. అనంతరం సిమ్రన్ దుస్తులు మార్చి.. ఆ స్థలంలో జ్యోతికి సంబంధించిన ఐడీ కార్డులు, కొన్ని వస్తువులను పడేసి జ్యోతి, కృష్ణ అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు మాత్రం సిమ్రన్ మృతదేహం.. జ్యోతిదే అని భావించి తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Sleeping: గాఢ నిద్రలో ఉండగా ఎవరైనా మీద కూర్చున్నట్టు అనిపించిందా..? నోట మాట రాలేని పరిస్థితి ఏర్పడిందా..?
ఇదిలా ఉంటే మరోవైపు సిమ్రన్ తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా యువతి హత్యకు సంబంధించిన ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు చూపించగా మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా బాడీ సిమ్రన్‌దిగా గుర్తించారు. దీంతో జ్యోతి, కృష్ణలను వెతికే పనిలో పడ్డ పోలీసులు... షిమ్లాలో గుర్తించి 2020లో అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. కేసు విచారణలో ఉండగానే క్షయరోగంతో కృష్ణ జైల్లోనే చనిపోయాడు. ఇక ఈ ఘటనపై మంగళవారం తీర్పు చెప్పిన పానిపత్ న్యాయస్థానం జ్యోతికి మాత్రం జీవితఖైదు విధించింది.
ఇది కూడా చదవండి: Gold Shop: వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ షాపులో బంగారు నగలన్నీ మాయం.. అనుమానంతో ఆ యజమాని షాపంతా వెతికితే..
Updated Date - 2023-03-31T16:49:59+05:30 IST