Viral Video: సింహాలు కూడా ఇలా ప్రవర్తిస్తాయా? ఓ వ్యక్తిపై సింహం ఎంత ప్రేమ కురిపిస్తోందో చూడండి.. నెటిజన్లు షాక్!
ABN, First Publish Date - 2023-08-20T16:23:31+05:30
సాధారణంగా మనషులు, జంతువుల మధ్య అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనుషులు పెంచుకునే కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు బాగా మచ్చిక అవుతాయి. మనుషులపై ప్రేమను కురిపిస్తాయి. కానీ, క్రూర జంతువులతో మనుషులకు అటాచ్‌మెంట్ చాలా తక్కువగా ఉంటుంది.
సాధారణంగా మనషులు (Humans), జంతువుల (Animlas) మధ్య అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనుషులు పెంచుకునే కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు బాగా మచ్చిక అవుతాయి. మనుషులపై ప్రేమను కురిపిస్తాయి. కానీ, క్రూర జంతువులతో మనుషులకు అటాచ్‌మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అవి మనుషులతో స్నేహంగా ఉండవు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) ఆ అభిప్రాయం తప్పని నిరూపిస్తోంది.
african_animal అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తిని చూసిన సింహం (Lion) ఎంతో సంతోషానికి గురైంది. ఎంతో ఆనందంగా ఆ వ్యక్తి మీదకు దూకింది. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా హత్తుకున్నారు. ఆ సింహం ప్రేమ, ఆ వ్యక్తి ధైర్యం చాలా మందిని ఆకట్టుకుంటోంది. సింహాలు కూడా మనుషులపై ఇంత ప్రేమను ప్రదర్శిస్తాయా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Man and lion share a warm hug).
Viral: టీ తాగడానికి టీచర్‌ను ఇంటికి పిలిచిన మహిళ.. అతడి ఎదురుగానే బట్టలు తీసేసి ఏం చేసిందంటే..
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 18 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``నాకు కూడా అలాంటి హగ్ కావాలనిపిస్తోంది``, ``ఈ వీడియో నన్ను చాలా ఎమోషనల్‌కు గురి చేసింది. ఈ వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు``, ``ఈ ప్రేమ చాలా విలువైనది`` అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేశారు.
Updated Date - 2023-08-20T16:23:31+05:30 IST