ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: మాజీ ప్రియుడి నుంచి మూడేళ్ల తర్వాత వచ్చిందో మెసేజ్.. అంతా చదివిన ఆ ప్రేయసికి మైండ్‌బ్లాక్.. అతడేం అడిగాడంటే..!

ABN, First Publish Date - 2023-05-22T16:26:34+05:30

కొందరు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. ఇంకొంత మంది కొన్ని కారణాల చేత మధ్యలోనే బ్రేకప్ ఇచ్చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసుంటాం. వినుకుంటాం. అలాగే ఆ జంట కూడా

Viral News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. ఇంకొంత మంది కొన్ని కారణాల చేత మధ్యలోనే బ్రేకప్ ఇచ్చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసుంటాం. వినుకుంటాం. అలాగే ఆ జంట కూడా ప్రేమించుకున్నారు. పెళ్లిదాకా రాకుండానే మధ్యలోనే విడిపోయారు. ఇక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇలా మూడేళ్లు గడిచిపోయింది. ఇంతలో ఆ అమ్మాయికు ఒక మెసేజ్ వచ్చింది. చూసి షాక్ అయింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి? ఎవరు పంపించారు. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ప్రేమలో ఉన్నప్పుడూ అమ్మాయి.. అబ్బాయి.. ఊహల్లో విహరిస్తుంటారు. ఏవేవో కలలు కంటూ ఈ లోకంలోనే ఉండరు. అబ్బాయి.. అమ్మాయిను సంతోష పెట్టేందుకు ఆలోచిస్తుంటాడు.. అమ్మాయి.. అబ్బాయిను సంతోష పెట్టేందుకు ఫ్లాన్ చేస్తుంటుంది. ఇలా ప్రేమ మత్తులో ఉన్నప్పుడూ ఎవరేమి చెప్పినా పట్టించుకోరు. అంతగా ప్రేమ అనే మైకంలో మునిగిపోతారు. అంతేకాదు.. ఒకరి కొకరు బహుమతులు ఇచ్చుకోవడం.. వీలు కుదిరినప్పుడల్లా సినిమాలు, షికార్లు, పార్టీలు, టూర్లంటూ తిరుగుతారు. అలానే ఆ జంట కూడా ఎంజాయ్ చేసింది. ప్రేమలో ఉన్నప్పుడు గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకున్నారు. కానీ మధ్యలోనే వారిద్దరూ విడిపోయారు. జరిగిందంతా ఓ పీడకల అనుకుని ఆ విషయాలేమీ పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమైపోయిందామె (Ex Girlfriend). అంతాలోనే ఫోన్‌కు షాకింగ్ మెసేజ్.. చూసి ఖంగుతింది. ఇదేంట్రా బాబోయ్ అంటూ ఒక్కసారిగా షేక్ అయింది.

బ్రేకప్ అయిన మూడేళ్లకు మాజీ ప్రియుడు.. ఆమెకు ఒక మెసేజ్ పంపించాడు. అది చూడగానే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. అంతే ఆ మెసేజ్ ఉద్దేశాన్ని నలుగురితో పంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె సోషల్ మీడియా ద్వారా తన అనుభవాన్ని పంచుకుంది. విడిపోయిన మూడేళ్ల తర్వాత మాజీ ప్రియుడు తనను డబ్బులు (money back after 3 years) తిరిగి ఇవ్వాలని ఫేస్‌బుక్ ద్వారా మెసేజ్ పంపినట్లు తెలిపింది. ప్రేమలో ఉన్నప్పుడు ప్రియుడు.. రూ.18 వేలు విలువ చేసే గిఫ్ట్‌ను ఇచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బును (money) తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరికి ఆమె ఆ డబ్బును తిరిగి కూడా ఇచ్చేసింది. అయితే ఎవరైనా ఏదైనా బహుమతి ఇస్తే దాని తిరిగి ఇవ్వొద్దని ఈ సందర్భంగా ఆమె సలహా ఇచ్చింది. ఈ పోస్టింగ్‌పై నెటిజన్లు తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Crime News: 16 ఏళ్ల బాలిక అతి తెలివి మామూలుగా లేదుగా.. ఒక్క మెసేజ్‌తో కోటి రూపాయలు సంపాదించాలనుకుంది.. కానీ..!

Updated Date - 2023-05-22T16:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising