Viral Video: ఎందుకొచ్చిన తిప్పలయ్యా సామీ.. కాసేపాగి ఉంటే ప్రాణాలే పోయేవి కదా.. అందరికీ షాకిద్దామనుకుంటే..!
ABN, First Publish Date - 2023-10-29T12:50:31+05:30
ఒక్కొక్కరికి ఒక్కొ పిచ్చి.. ఎవరి పిచ్చి వారికి ఆనందం.. సోషల్ మీడియా (Social Media) విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత కాలంలో వినూత్నంగా కనబడాలని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నారు.
Viral Video: ఒక్కొక్కరికి ఒక్కొ పిచ్చి.. ఎవరి పిచ్చి వారికి ఆనందం.. సోషల్ మీడియా (Social Media) విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత కాలంలో వినూత్నంగా కనబడాలని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇదే కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్పైడర్‌మ్యాన్ (Spiderman) డ్రెస్ ధరించిన ఓ వ్యక్తి వింత పనికి పూనుకున్నాడు. ఆ తర్వాత పడరానిపాట్లు పడ్డాడు. ఈ ఘటన తాలూకు వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video: ఈ డాక్టరమ్మను ఆ తల్లి జీవితాంతం మర్చిపోదు.. పుట్టగానే బిడ్డలో ఏమాత్రం చలనం లేకపోతే.. ఏం చేసి బతికించిందంటే..!
వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకున్న ఓ వ్యక్తి నేరుగా స్విమ్మింగ్ పూల్ (Swimming pool) లోకి దూకేశాడు. నీటిలో దూకిన తర్వాత మనోడికి అసలు విషయం తెలిసింది. ఆ డ్రెస్ కారణంగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దాంతో ఆ వ్యక్తి ఎలాగోలా స్మిమ్మింగ్ పూల్ నుంచి బయటపడ్డాడు. ఇక మనోడి అవస్థను గమనించిన తోటివారు వెంటనే అతని ముఖంపై నుంచి డ్రెస్‌ను తొలగించారు. దాంతో అతనికి ఊపిరి తీసుకోవడం సాధ్యమైంది. వినూత్నంగా ట్రై చేసి.. అందరికీ షాకిద్దామనుకుంటే.. సీన్ కాస్తా ఇలా రివర్స్ అయిందన్నమాట.
Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం ఘోరం.. కారుపైకి ఎగబాకిన ఆక్టోపస్.. ఒక్క నిమిషంలోనే కలలో కూడా ఊహించని సీన్..!
ఇక ఈ ఘటనను అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పెట్టాడు. అంతే.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియో (Viral Video) కు ఇప్పటివరకు 6.7 లక్షల వ్యూస్, 18వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'ఎందుకొచ్చిన తిప్పలయ్యా సామీ.. కాసేపాగి ఉంటే ప్రాణాలే పోయేవి కదా..' అని చురకలు అంటిస్తున్నారు.
Viral News: ఒకేసారి రూ.6.50 కోట్లను విత్‌డ్రా.. డబ్బు తీసుకునేందుకు ఆ వ్యక్తి పెట్టిన వింత కండీషన్‌కు బ్యాంకు సిబ్బంది షాక్.. చివరకు..!
Updated Date - 2023-10-29T12:50:31+05:30 IST