ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tomatoes: వస్తు మార్పిడి అంటే ఇదీ.. వైన్ షాప్‌లో టమాటాలు ఇచ్చి మద్యం తీసుకున్నాడు.. ఫన్నీ వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-08-19T10:39:38+05:30

డబ్బు అందుబాటులోకి రాకముందు వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. మనకు ఓ వస్తువు కావాల్సి వచ్చినపుడు అంతే విలువైన వస్తువుతో కొనుగోలు చేసుకునే విధానం అమలులో ఉండేది. రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య వస్తువులు లేదా సేవల వ్యాపారం డబ్బు లేకుండానే జరిగిపోతుండేది.

డబ్బు అందుబాటులోకి రాకముందు వస్తు మార్పిడి (Barter system) విధానం అమలులో ఉండేది. మనకు ఓ వస్తువు కావాల్సి వచ్చినపుడు అంతే విలువైన వస్తువుతో కొనుగోలు చేసుకునే విధానం అమలులో ఉండేది. రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య వస్తువులు లేదా సేవల వ్యాపారం డబ్బు లేకుండానే జరిగిపోతుండేది. కొన్ని మారుమూల ప్రాంతాలలో వస్తుమార్పిడి ఇప్పటికీ ఆచరణలో ఉంది. అయితే నగరంలో ఇలాంటి విధానం మాత్రం కచ్చితంగా లేదు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తుంటే మాత్రం మళ్లీ వస్తు మార్పిడి విధానం అమల్లోకి వచ్చినట్టు అనిపిస్తోంది (Man exchanges tomatoes for liquor).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి కొన్ని టమాటాల (Tomatoes)ను వైన్ షాప్ (Wine Shop) వద్దకు తీసుకెళ్లి మద్యం (Liquor) కావాలని అడిగాడు. ``టమాటాలు తీసుకుని మీకు మద్యం బాటిల్ ఇవ్వాలా`` అని కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ప్రశ్నించాడు. వినియోగదారుడు నవ్వుతూ ``అవును`` అని చెప్పాడు. కౌంటర్‌లోని వ్యక్తి టమోటాలకు బదులుగా మద్యం ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 85 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

Viral Video: ఈ కుర్రాడు ఎంత తెలివైనవాడు.. టీచర్ దగ్గర ఎలా మాట్లాడాలో తండ్రికే నేర్పుతున్నాడు.. క్యూట్ వీడియో వైరల్!

ప్రస్తుతం టమాటాల సప్లయ్ తగ్గడంతో దేశవ్యాప్తంగా వాటి ధర పెరిగింది. ఒక దశలో కేజీ రూ.200 వరకు వెళ్లింది. ఇప్పుడిప్పుడే టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏదేమైనా, ఈ ఫన్నీ వీడియో (Funny Video) సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``భారత్‌లో కొత్త కరెన్సీ టమాటాలే``, ``డాలర్‌కు పోటీగా భారత్ కొత్త కరెన్సీ ``, ``ఆర్బీఐ టమాటాలను నిల్వ చేసి కొత్త కరెన్సీని ముద్రించాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-19T10:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising