ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మనసును కట్టిపడేస్తున్న వీడియో.. ఓ కూతురు ఉద్యోగానికి వెళ్లేందుకు రెడీ అవుతోంటే ఆ తండ్రి ఏం చేశాడో చూస్తే..!

ABN, First Publish Date - 2023-08-25T15:43:43+05:30

ఈ సృష్టిలో తల్లికి ఎంతో విలువ ఉంది. గౌరవం ఉంది. గుర్తింపు ఉంది. అయితే తల్లితో సమానంగా మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే నాన్న మాత్రం గుర్తింపు విషయంలో వెనుకబడ్డాడు. పిల్లలకు అవసరమైనప్పుడల్లా వెన్నుదన్నుగా నిలిచి వారిని చేయి పట్టి ముందుకు నడిపించే తండ్రి ప్రేమను తిరిగి పొందే విషయంలో మాత్రం వెనుక వరుసలోనే ఉంటాడు.

ఈ సృష్టిలో తల్లికి (Mother) ఎంతో విలువ ఉంది. గౌరవం ఉంది. గుర్తింపు ఉంది. అయితే తల్లితో సమానంగా మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే నాన్న (Father) మాత్రం గుర్తింపు విషయంలో వెనుకబడ్డాడు. పిల్లలకు అవసరమైనప్పుడల్లా వెన్నుదన్నుగా నిలిచి వారిని చేయి పట్టి ముందుకు నడిపించే తండ్రి ప్రేమను తిరిగి పొందే విషయంలో మాత్రం వెనుక వరుసలోనే ఉంటాడు. కుటుంబం మొత్తాన్ని పోషించడానికి శ్రమ పడే నాన్నలు నిజమైన హీరోలు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే తండ్రికి తన కూతురిపై ఎంతో ప్రేమ ఉంటుందో అర్థమవుతుంది (Father and daughter relation).

poojabihani అనే ఎయిర్ హోస్టెస్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆ యువతి ఉద్యోగానికి వెళ్లేందుకు హడావిడిగా రెడీ అవుతోంది. పక్కనే తండ్రి ప్లేట్‌తో నిల్చుని ఆ యువతికి ఆహారం తినిపిస్తున్నాడు (Father feeds Daughter). ``నాన్నా.. నువ్వు అత్యుత్తమం. నేను నీకు ఎప్పుడూ తగినంతగా థ్యాంక్స్ చెప్పలేదు. నువ్వు నా కోసం చేసిన ప్రతి దానికీ ధన్యవాదాలు. నువ్వు ఎక్కడుంటే అదే నా ఇల్లు. ఐ లవ్యూ పాపా`` అని కామెంట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Snake Dance: స్పీకర్‌లోంచి వస్తున్న మ్యూజిక్‌ విని ఒక్కసారిగా ఆగిపోయిన పాము.. మరుక్షణంలోనే అదేం చేసిందో చూస్తే..!

ఈ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 8.6 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ క్యూట్ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్‌గా స్పందించారు. ``తండ్రి స్థానంలోకి వేరెవరూ రాలేరు``, ``నేను డ్యూటీకి వెళ్లే హడావిడిలో ఉన్నప్పుడు మా అమ్మ కూడా అలాగే తినిపించేది``, ``ఆ యువతి చాలా అదృష్టవంతురాలు.. బెస్ట్ డాడ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-25T15:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising