Odisha train accident: భార్యపై కేసు పెట్టిన భర్త.. ఎందుకంటే ఘోర ఒడిశా రైలు ప్రమాదంలో...
ABN, First Publish Date - 2023-06-07T18:37:15+05:30
డబ్బులకోసం బతికున్న భర్త చనిపోయాడని అబద్ధం చెప్పింది ఓ మహిళ. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తన భర్త చనిపోయాడని.. మృతదేహాన్ని అప్పగించాలని పోలీసులు కోరింది. ఇందుకు ‘‘నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా’’ అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఖంగుతున్న ఆమె అడ్డంగా దొరికిపోయింది.
భువనేశ్వర్: డబ్బులకోసం బతికున్న భర్త చనిపోయాడని అబద్ధం చెప్పింది ఓ మహిళ. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తన భర్త చనిపోయాడని.. మృతదేహాన్ని అప్పగించాలని పోలీసులు కోరింది. ఇందుకు ‘‘నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా’’ అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఖంగుతున్న ఆమె అడ్డంగా దొరికిపోయింది. ఒడిశా రైలు ప్రమాదఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన పరిహారంకోసమే ఆ మహిళ డ్రామా ఆడిందని పోలీసులు నిర్ధారించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ విషయం తెలుసుకున్న ఆమె భర్తకు ఒళ్లు మండింది. డబ్బులకోసం బతికున్న తనను చనిపోయాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కిలాడిని భర్త ఏం చేశాడో..ఆ కథేంటో చూద్దాం.
గీతాంజలి దత్తా(Gitanjali Datta ).. ఒడిశాలోని కటక్ జిల్లా మణియాబండకు(Maniabanda in Cuttack District) చెందిన వివాహిత. జూన్ 2న జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో(Odisha Train Accident) తన భర్త బిజయ్ దత్తా(Bijay Datta) చనిపోయాడని.. మృతదేహం అప్పగిస్తే అంత్యక్రియలు చేసుకుంటామని నమ్మబలికింది. ఇదంతా నిజమని నమ్మిన పోలీసులు మార్చురీలో ఉన్న మృతదేహాలను చూపించారు. ఓ డెడ్ బాడీని చూపి.. అది తన భర్త మృతదేహమే అని చెప్పింది. ఫార్మాల్టీ ప్రకారం ఆధారాలు చూపాలని ఆ మహిళను పోలీసులు కోరారు. అక్కడ దొరికిపోయింది ఆ కిలాడి. అయితే తప్పుడు పని చేసిన గీతాంజలిని పోలీసులు మందలించి వదిలేశారు. కానీ.. ఆమె భర్త బిజయ్ దత్తా మాత్రం వదల్లేదు. బతికుండగానే నన్ను చంపేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గీతాంజలి దత్తాను కఠినంగా శిక్షించాలని కేసు పెట్టాడు.
ప్రస్తుతం గీతాంజలి దత్తా పరారీలో ఉంది. కేసు పెట్టి జైల్లో పెడతారమోనని భయంతో గీతాంజలి దత్త భయంతో అజ్ఒతంలోకి వెళ్లిందని పోలీసులు తెలిపారు. కొసమెరుపేంటంటే..గీతాంజలి దత్తా 13 యేళ్లుగా భర్త బిజయ్ దత్తాతో విడిగా ఉంటోంది.
Updated Date - 2023-06-07T18:37:15+05:30 IST