పదే పదే బ్రతిమాలినా పట్టించుకోని భార్య.. ఆమెను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో.. ఓ రోజు..
ABN, First Publish Date - 2023-01-13T19:53:04+05:30
సాధారణంగా దంపతుల మధ్య ఎన్ని సమస్యలు తలెత్తినా కాసేపటికి మళ్లీ సర్దుమణుగుతుంటాయి. అయితే ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు కూడా చివరకి చిలికి చిలికి గాలివానగా మారుతుంటాయి. ఈ క్రమంలో హత్యలు, ఆత్మహత్యల వరకూ దారి తీస్తుంటుంది...
సాధారణంగా దంపతుల మధ్య ఎన్ని సమస్యలు తలెత్తినా కాసేపటికి మళ్లీ సర్దుమణుగుతుంటాయి. అయితే ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు కూడా చివరకి చిలికి చిలికి గాలివానగా మారుతుంటాయి. ఈ క్రమంలో హత్యలు, ఆత్మహత్యల వరకూ దారి తీస్తుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. భార్యను పదే పదే బ్రతిమాలినా తనను పట్టించుకోకపోవడంతో భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరకు ఓ రోజు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వినూత్న ప్రయోగం.. లారీ వెనుక ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాయబరేలిలోని ఉంచహర్ పరిధి మాలిన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాల్‌చంద్ లోథ్(45) అనే వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇన్నాళ్లూ సంతోషంగా ఉన్న ఈ దంపతుల మధ్య ఇటీవల సమస్యలు (problems) తలెత్తాయి. చిన్న చిన్న సమస్యలూ ఇద్దరూ గొడవపడుతుండేవారు. కానీ కొద్ది సేపటికీ మళ్లీ కలిసిపోయేవారు. అయితే ఇటీవల మళ్లీ వీరి మధ్య గొడవలు (problems) తలెత్తాయి. ఈ విషయంలో లాల్‌చంద్ భార్య తీవ్ర ఆగ్రహానికి గురై.. భర్తతో మాట్లాడకుండా దూరం పెట్టింది. లాల్‌చంద్ ఎంత బ్రతిమాలినా ఆమె మాత్రం శాంతించలేదు. తనను అసలు పట్టించుకోవడమే మానేసేసరికి తట్టుకోలేకపోయాడు.
ప్రేయసి గుర్తుగా వీడియోలు, ఫొటోలను దాచుకున్న ప్రియుడు.. అయితే చివరకు ప్రియురాలి తల్లి అలా అనడంతో..
ఇంకోసారి ఇలా చేయను.. నాతో మాట్లాడు.. అంటూ భార్యను పదే పదే వేడుకున్నాడు. అయినప్పటికీ ఆమె మాత్రం భర్త మాట వినిపించుకోలేదు. అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన లాల్‌చంద్.. గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఊరి బయటకు వెళ్లి ఎవరూ లేని సమయం చూసి.. కాలువలో దూకి ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Updated Date - 2023-01-13T19:57:34+05:30 IST