Monkey Video: పాపం.. ఈ కోతులకు ఎంత దప్పిక వేసిందో.. ఈ యువకుడి చేతిలో బాటిల్ చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి..!
ABN, First Publish Date - 2023-07-25T16:19:24+05:30
ఈ ఏడాది వేసవి కాలం దేశ ప్రజలందరికీ చెమటలు పట్టించింది. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా అందరికీ దడ పుట్టించింది. మనుషుల పరిస్థితే అంత భయంకరంగా ఉంటే, జంతువుల కూడా ఊహించడం కూడా కష్టం. తాగునీరు కూడా దొరక్క ఎన్నో జంతువులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
ఈ ఏడాది వేసవి కాలం (Summer) దేశ ప్రజలందరికీ చెమటలు పట్టించింది. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా అందరికీ దడ పుట్టించింది. మనుషుల పరిస్థితే అంత భయంకరంగా ఉంటే, జంతువుల (Animals) పరిస్థితిని ఊహించడం కూడా కష్టం. తాగునీరు (Drinking Water) కూడా దొరక్క ఎన్నో జంతువులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అడవిలోని సింహాలు కూడా నీటి కోసం అల్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా కోతులు (Monkeys) కూడా దాహంతో ఇబ్బందులు పడ్డాయి.
మండుతున్న ఎండలో దాహాన్ని తట్టుకోగల సామర్థ్యం ఎవరికీ ఉండదు. గొంతు పూర్తిగా ఎండిపోయిన ఎవరైనా వచ్చి మీకు నీరు అందిస్తే ఎలా ఉంటుంది. ఆ క్షణంలో ఆ నీరు అమృతం కన్నా తక్కువ కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో కోతులు అలాగే ఫీలయ్యాయి (Thirsty Monkeys). viralbhayani అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి బాటిల్ (Water Bottle)తో నీరు ఇస్తుండగా కోతులు ఆ నీటిని ఆబగా తాగుతున్నాయి.
Delivery Boy Success Story: సాధించావ్ బ్రో.. నిన్నటిదాకా ఈ కుర్రాడు జొమాటో డెలివరీ బాయ్.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి..!
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది. ఆ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. దాదాపు 13 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``నీళ్లు అందిస్తున్న ఆ వ్యక్తి హనుమంతుడితో సమానం``, ``మానవత్వం ఇంకా మిగిలే ఉంది``, ``పాపం.. ఆ కోతులు ఆహారం కోసం ఇంకెంత కష్టపడుతున్నాయో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-25T16:19:24+05:30 IST