Share News

Viral: ఇంటి పనుల్లో భార్యకు సాయం చేయనన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం.. ఇతడి లాజిక్‌కు జనాలు ఫిదా!

ABN , First Publish Date - 2023-10-14T18:45:56+05:30 IST

నెట్టింట్లో ఓ వ్యక్తి పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. నా భార్యకు నేను ఇంటి పనుల్లో సాయం చేయనంటూ అతడు టిక్‌టాక్ వీడియో చేయడమే కారణం. అంతేకాదు.. ఈ మాట అన్నందుకు అతడిపై జనాలు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అందరూ నీలాంటే సంసారాల్లో సమస్యలే రావని చెబుతున్నారు.

Viral: ఇంటి పనుల్లో భార్యకు సాయం చేయనన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం.. ఇతడి లాజిక్‌కు జనాలు ఫిదా!

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట్లో ఓ వ్యక్తి పెట్టిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్‌గా అవుతోంది. నా భార్యకు నేను ఇంటి పనుల్లో సాయం చేయనంటూ అతడు వీడియోలో చెప్పడమే కారణం. అంతేకాదు.. ఈ మాట అన్నందుకు అతడిపై జనాలు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అందరూ నీలాంటే సంసారాల్లో సమస్యలే రావని చెబుతున్నారు. భార్యకు సాయం చేయనంటే పొగడ్తలేంటి అని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరం తెలిస్తే అతడి అసలు ఉద్దేశం ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.

Viral: వింత వ్యాధి..77 ఏళ్లు వచ్చినా బ్రహ్మచారిగా మిగిలిపోడానికి ఇతడు చెప్పిన కారణం తెలిస్తే..

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన జే,ఆర్ మింటన్ యూపీఎస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఇటీవల మింటన్ చేసిన వీడియో జనాలకు తెగ నచ్చేసింది. భార్యకు ఇంటి పనుల్లో సాయం చేయనంటూ అతడు వీడియో మొదలెట్టడంతో జనాలు తొలుత నోరెళ్లబెట్టారు. కానీ పోనుపోను అతడు చెప్పింది అర్థం చేసుకుని తాము ఇంతకాలం చేస్తున్న తప్పు ఇదా అంటూ ఆశ్చర్యపోయారు.

Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..


ఇంతకీ మనోడు చెప్పిందేంటంటే, అసలు ‘సాయం’ అనే మాటే తప్పట. ఈ పదం వాడితే అసలు ఇంటి పని మొత్తం మహిళలదే అన్న అర్థం వస్తుందని చెప్పాడు. కాబట్టి, అతడు భార్యకు ‘సాయం’ చేయడట. వంట వండటం, ఇల్లు సుభ్రం చేయడం, బట్టలు ఉతకడం.. ఇవన్నీ ఓ తండ్రిగా, భర్తగా తన పనులేనని వివరించాడు. మరి తన పనుల విషయం భార్యకు సాయం ఎలా చేస్తానని కొత్త లాజిక్ ఎత్తుకున్నాడు.

Viral: సూపర్ ఐడియా బ్రో.. జొమాటోలో ఫుడ్ ఆర్డరిచ్చాక యువకుడు చేసిన పనికి జనాలు ఫిదా.. వీడియో వైరల్

మిల్టన్ వాదన విన్నాక జనాలకు తమ ఆలోచనా విధానంలో దాగున్న లోపం కనిపించినట్టైంది. దీంతో, మిల్టన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరూ నీలా ఆలోచిస్తే సంసారాలు సాఫీగా సాగిపోతాయని అనేక మంది కామెంట్స్ చూపించారు. అయితే కొందరికి మిల్టన్ వాదన విన్నాక తమ జీవితంపై మరింత విరక్తి కలిగింది. తమ భర్తలపై అనేక మంది మహిళలు ఫిర్యాదు చేశాడు.

Viral: రాత్రివేళ లిఫ్ట్ కోసం బతిమాలిన మహిళ.. వద్దనుకుంటూనే ఆమెను కారులో ఎక్కించుకున్న వ్యాపారి..చివరకు..

Updated Date - 2023-10-14T18:56:05+05:30 IST