ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: హ్యాట్సాఫ్ బ్రదర్.. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి.. రాళ్ల మధ్యలో ఓ తాబేలు ఇరుక్కుపోతే ఏం చేశాడో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-11-04T13:23:20+05:30

కన్నవాళ్లనే పట్టించుకోని ఈ కాలంలో మూగజీవాలపై జాలి చూపించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఓ మూగజీవి ప్రమాదంలో ఉండడం చూసిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి దాని ప్రాణాలు కాపాడాడు.

Viral Video: కన్నవాళ్లనే పట్టించుకోని ఈ కాలంలో మూగజీవాలపై జాలి చూపించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఓ మూగజీవి ప్రమాదంలో ఉండడం చూసిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి దాని ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి దయర్ద్రా హృదయం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ 'ఎక్స్' (ఇంతకుముందు ట్విటర్) లో 'buitengebieden' అనే హ్యాండిల్‌లో పోస్ట్ అయింది. 'బండరాళ్ల మధ్య చిక్కుకున్న తాబేలును ఈ వ్యక్తి రక్షించాడు' లైన్‌ను వీడియోకు జోడించడం జరిగింది.

WhatsApp groups: ఎవరు పడితే వాళ్లు వాట్సప్ గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తున్నారా..? ఈ ట్రిక్‌ను కనుక వాడితే..!

ఇక వీడియోలోని దృశ్యాలను చూస్తే.. సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ తాబేలు.. రెండు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుని లోపలికి వెళ్లలేక ఇబ్బంది పడడం మనం గమనించవచ్చు. అప్పటికే అలలు దాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి కూడా. కానీ, అది ఎంత ప్రయత్నించిన బండరాళ్ల మధ్య నుంచి బయటపలేకపోతుంది. అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఓ వ్యక్తి ఆ తాబేలు అవస్థను గమనించాడు. వెంటనే దాని దగ్గరికి వెళ్లి, తన రెండు చేతులతో బండరాళ్ల మధ్య నుంచి తాబేలును పైకి తీయడానికి ప్రయత్నించడం మనం వీడియోలో చూడొచ్చు. చివరికి అతికష్టం మీద దాన్ని బండరాళ్ల మధ్య నుంచి బయటకు తీసి, సముద్రంలోకి వదిలివేయడం వీడియోలో ఉంది. దాంతో బతుకుజీవుడా అంటూ ఆ తాబేలు సముద్రంలోకి వెళ్లిపోయింది.

Viral Video: చేత్తో ఇటుకను పట్టుకుని మరీ భార్యాభర్తల మధ్య బిగ్ ఫైటింగ్.. వీడియోను చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!

ఈ వీడియో ఈ నెల 31న ట్విటర్‌లో పోస్ట్ కాగా, ఇప్పటివరకు 3.3 మిలియన్ల వ్యూస్, 87వేలకు పైగా లైక్స్ వచ్చాయి. లక్షలాది మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న ఈ వీడియోపై అదేస్థాయిలో కామెంట్స్ కూడా వచ్చాయి. 'హ్యాట్సాఫ్ బ్రదర్.. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి.. మూగజీవిని కాపాడావు' అంటున్నారు. 'మానవత్వానికి అసలు నిదర్శనం ఇదే', 'మూగ జీవులపట్ల మనం సృష్టించుకున్న ప్రేమ', 'నీవు చాలా గొప్పొడివి బ్రదర్. ధన్యవాదాలు', 'ఇలాంటివి చూస్తున్నప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంతో గొప్ప మనసు అతనిది. గ్రేట్ హ్యూమానిటీ బ్రో..' ఇలా నెటిజన్లు ఈ వీడియోపై తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

YouTube: మొత్తానికి యూట్యూబ్ భలే షాకిచ్చిందిగా.. యాడ్స్ రాకుండా టెక్నిక్స్ వాడే వాళ్లకు..!

Updated Date - 2023-11-04T13:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising