ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: యువతిపై కామెంట్.. కారుతో తొక్కేసిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో

ABN, Publish Date - Dec 27 , 2023 | 10:04 PM

పబ్‌లో మొదలైన చిన్న గొడవ చివరకు యువతి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఓ యువకుడు మరో యువతిపై కామెంట్ చేశాడు. దీంతో యువతీయువకుల మధ్య గొడవ మొదలైంది. చివరకు..

పబ్‌లో మొదలైన చిన్న గొడవ చివరకు యువతి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఓ యువకుడు మరో యువతిపై కామెంట్ చేశాడు. దీంతో యువతీయువకుల మధ్య గొడవ మొదలైంది. చివరకు వారిలో ఓ యువకుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. చూస్తుండగానే యువతి పైకి కారు ఎక్కించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జైపూర్‌లోని (Jaipur) జవహర్ సర్కిల్ ప్రాంతంలోని ఒక పబ్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమ (19) అనే యువతి.. తన స్నేహితుడు రాజ్ కుమార్‌తో కలిసి సోమవారం రాత్రి డిన్నర్ చేసేందుకు రెస్టారెంట్‌కి వెళ్లారు. ఈ రెస్టారెంట్ అండ్ బార్‌కు రాజ్ కుమార్ సహ యజమాని. అయితే మంగేష్ అనే వ్యక్తి కూడా తన స్నేహితురాలితో కలిసి అక్కడ డ్రింక్స్ చేస్తున్నాడు. ఈ సమయంలో వారు ఉమపై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. రాజ్ కుమార్ అభ్యంతరం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన మంగేష్.. ఉమ తనకు ముందే తెలుసంటూ అతడి వాగ్వాదానికి దిగాడు.

Viral Video: విమానంలో వీడియో తీస్తుండగా జారిపడిన ఫోన్.. కింద పడ్డాక అందులో రికార్డైన చివరి దృశ్యం చూస్తే..

ఈ క్రమంలో మంగేష్ ఉమను తాకే ప్రయత్నం చేశాడు. తర్వాత రాజ్ కుమార్‌, ఉమ కలిసి క్యాబ్‌లో రెస్టారెంట్‌కి బయలుదేరారు. ఇంతలో మంగేష్, అతని స్నేహితురాలు కూడా అక్కడికి వచ్చి వారితో గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త కాసేపటికి చాలా పెద్దది అయింది. తర్వాత మంగేష్ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. ఇందుకు రాజ్ కుమార్‌, ఉమ అడ్డుపడ్డారు. అయినా అతను లెక్క చేయకుండా వారిని ఢీకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఉమ అక్కడికక్కడే చనిపోగా.. రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. రాజ్ కుమార్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న మంగేష్, అతడి స్నేహితురాలి కోసం గాలిస్తున్నారు.

Viral Video: ఇంట్లోకి చొరబడి.. పండు అనుకుని ఉల్లిపాయను ఎత్తుకొచ్చిన కోతి.. కొరికిన తర్వాత దాని రియాక్షన్ చూడండి..

Updated Date - Dec 27 , 2023 | 10:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising