ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: తిమింగళం మీదకు దూకేసిన వ్యక్తి.. తప్పించుకోవడం ఇక అసాధ్యం అనుకుంటే.. చివరకు ఛత్రపతిని మించిపోయాడుగా..

ABN, First Publish Date - 2023-07-20T21:51:39+05:30

సరదాకు పోయి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు రీల్స్ కోసం వివిధ రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే ఇలాంటి సాహసాలు కొన్నిసార్లు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి..

సరదాకు పోయి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు రీల్స్ కోసం వివిధ రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే ఇలాంటి సాహసాలు కొన్నిసార్లు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సముద్రంలో పడవలో వెళ్తుండగా.. ఓ వ్యక్తి ఉన్నట్టుండి పెద్ద తిమింగళం మీదకు దూకేస్తాడు. దాని బారి నుంచి తప్పించుకోవడం ఇక అసాధ్యం అనుకుంటున్న సమయంలో చివరకు అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో! ఇతను ఛత్రపతిని మించిపోయాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఛత్రపతి సినిమాలో (chatrapathi movie) హీరోను సముద్రంలో పడేస్తే.. చివరకు తిమింగళంతో (whale) పోరాడి బయటకు వచ్చిన సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఇంతకు మించిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు సముద్రంలో విహారానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వారికి ఓ పెద్ద తిమింగళం కనిపింస్తుంది. దాన్ని చూడగానే అంతా భయంతో పడవ దిశను మార్చుకుంటుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఉన్నట్టుండి పడవలో నుంచి తిమింగళం (man jumped on the whale) మీదకు దూకేస్తాడు. దీంతో పడవలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ అతడికి కాస్త దూరంగా వెళ్తారు.

Viral: పనస పండ్లు కోసేందుకు చెట్టెక్కాడు.. అనుమానం వచ్చి పాదాల వైపు చూసుకుని చివరకు ఖంగుతిన్నాడు..

తిమింగళం నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని అంతా అనుకుంటారు. కానీ అతను మాత్రం దాని మీద కూర్చుని గుర్రపు స్వారీ చేసినట్లుగా తిమింగళంతో ఆడుకుంటాడు. అంతటితో ఆగకుండా దాని మీద నిలబడి డాన్సు (dance) కూడా చేస్తాడు. ఇలా చాలా సేపు తిమింగళంతో ఆడుకుని.. ‘‘వెళ్లొస్తా మిత్రమా.. మళ్లీ కలుద్దాం’’.. అనుకుంటూ ఈదుకుంటూ వచ్చి పడవ ఎక్కేస్తాడు. ఈ ఘటనను పడవలో ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో (Viral Video) నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇతడికి ఎంత ధైర్యం’’.. అని కొందరు, ‘‘ఇతడు ఛత్రపతికే అన్నలా ఉన్నాడే’’.. అని ఇంకొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral: ఒకరిది పాకిస్తాన్.. మరొకరిది భారత్.. లండన్‌లో మీటింగ్.. దీంట్లో వింతేముందనుకుంటున్నారా..? అసలు వీళ్లెవరో తెలిస్తే..!

Updated Date - 2023-07-20T21:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising