Viral Video: మరీ ఇంత అమానుషమా? ట్రైన్లో భుజం మీద తలపెట్టి నిద్రపోయాడని ఓ వ్యక్తి ఆగ్రహం.. ఏం చేశాడంటే..
ABN, First Publish Date - 2023-08-27T20:56:36+05:30
అమెరికాలోని న్యూయార్క్ సిటీ సబ్ వేలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. పక్కన కూర్చున్న వ్యక్తి తన భుజంపై తల పెట్టి నిద్రపోయినందుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అతడిపై తీవ్రంగా దాడి చేశాడు.
అమెరికా (Amerinca)లోని న్యూయార్క్ సిటీ సబ్ వే (New York City subway)లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. పక్కన కూర్చున్న వ్యక్తి తన భుజంపై తల పెట్టి నిద్రపోయినందుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అతడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన మొత్తం ట్రైన్‌లోని కెమేరాలో రికార్డ్ అయింది. మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై రైలులోని ఇతర ప్రయాణికులు కూడా దాడి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి తన ఎదురుగా ఉన్న ప్యాసింజర్‌తో వాగ్వాదానికి దిగాడు. ``మీరంతా ఎవరో నాకు తెలుసు. పడుక్కోవాలనుకుంటే ఎక్కడికైనా వెళ్లండి. ట్రైన్లో పక్క వ్యక్తిపై కాదు`` అని అరుస్తున్నాడు. అంతలో అతడి పక్కనే కూర్చుని అతడి భుజంపై తల వాల్చి నిద్రపోయిన వ్యక్తి స్పందించాడు. ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన మోచేతితో ఆ వ్యక్తి మొహంపై పలుసార్లు కొట్టాడు. దీంతో ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఫైటింగ్‌కు దిగాడు.
Love Proposal: షాపింగ్ మాల్లో షాకింగ్ ట్విస్ట్.. ఫ్రెండ్స్‌తో యువతి ముందు మోకాలిపై కూర్చుని లవ్ ప్రపోజల్.. తర్వాత..
ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 వేల మందికి పైగా వీక్షించారు. చిన్న విషయానికి హింసాత్మకంగా స్పందించిన నిందితుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Updated Date - 2023-08-27T20:56:36+05:30 IST