బావకు బదులుగా డ్యూటీకి వెళ్లిన బామర్ది.. అర్ధరాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు..
ABN, First Publish Date - 2023-02-12T18:55:43+05:30
ఉపాధి కోసం బావ వద్దకు వచ్చిన బామర్దికి.. చివరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అర్జెంట్ పని మీద బయటికి వెళ్లాల్సి రావడంతో తన పనిని బామర్దికి అప్పగించాడు. బావకు బదులుగా డ్యూటీకి వెళ్లగా.. అర్ధరాత్రి ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో..
ఉపాధి కోసం బావ వద్దకు వచ్చిన బామర్దికి.. చివరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అర్జెంట్ పని మీద బయటికి వెళ్లాల్సి రావడంతో తన పనిని బామర్దికి అప్పగించాడు. బావకు బదులుగా డ్యూటీకి వెళ్లగా.. అర్ధరాత్రి ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గుజరాత్ (Gujarat) అహ్మదాబాద్ పరిధి వస్త్రపూర్ తలాబ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా పది రోజులుగా రిటర్నింగ్ వాల్ పనులు (Returning wall works) జరుగుతున్నాయి. దీంతో సదరు కాంట్రాట్లర్లు.. అక్కడ వికాస్ అనే వ్యక్తిని కాపలాగా పెట్టారు. రోజూ రాత్రి వేళ కాపలాగా (watchman) వెళ్లేవాడు. అయితే ఇటీవల అర్జెంట్ పని మీద అతను వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పనుల వద్ద కాపలా ఉండేందుకు.. తన బామర్ది అయిన లాల్‌భాయ్ అనే వ్యక్తిని పంపించాడు. రోజూ మాదిరే శనివారం కూడా ఉదయం పనులు ముగించుకున్న లాల్‌భాయ్.. రాత్రి అక్కడే కాపలాగా పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు (Unknown persons) అక్కడికి చేరుకుని, పడుకుని ఉన్న లాల్‌భాయ్‌పై గడ్డపారతో దాడి (attack) చేశారు.
ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న లాల్‌భాయ్‌ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించగా.. దాడి దృశ్యాలు బయటపడ్డాయి. వికాస్ అనుకుని లాల్‌భాయ్‌ని హత్య చేశారా... లేదా లాల్‌భాయ్‌నే టార్గెట్ చేశారా.. లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ హత్యతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Viral Video: బలవంతం చేయగా బయటకు కక్కేసిన పాము.. చివరకు అది మింగిన వస్తువును చూసి అంతా షాక్...
Updated Date - 2023-02-12T18:55:50+05:30 IST