ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇతడెవరో కానీ భవిష్యత్తులో బడా ఇంజనీర్ కావడం ఖాయం.. పంపును చేత్తో ముట్టుకోకుండానే నీళ్లను రప్పించేశాడుగా..!

ABN, First Publish Date - 2023-07-10T18:03:51+05:30

బ్రెయిన్ ఉపయోగిస్తే.. శ్రమ తగ్గుతుంది అని కొందరు తరచుగా నిరూపిస్తుంటారు. తమ మేథస్సును ఉపయోగించి కష్టమైన పనులను సులభంగా చేసే మార్గాలు కనిపెడుతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వినూత్న ఐడియాలు చాలా మందిని చేరుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెయిన్ ఉపయోగిస్తే.. శ్రమ తగ్గుతుంది అని కొందరు తరచుగా నిరూపిస్తుంటారు. తమ మేథస్సును ఉపయోగించి కష్టమైన పనులను సులభంగా చేసే మార్గాలు కనిపెడుతుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వినూత్న ఐడియాలు (Creative Ideas) చాలా మందిని చేరుతున్నాయి. అలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ జుగాడ్ వీడియో (Jugaad Videos) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బోరు పంపును చేత్తో ముట్టుకోకుండానే నీళ్లను బయటకు రప్పించాడు (Automatic Hand pump).

Upendra Verma అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి సాధారణ బోరును ఎలక్ట్రిక్ బోరుగా మార్చేశాడు. ఒక స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు ఆటోమేటిక్‌గా బయటకు వచ్చేలా ప్లాన్ చేశాడు. అందుకోసం అతడు పెద్దగా ఖర్చు కూడా పెట్టలేదు. కేవలం సైకిల్ చైన్ (Cycle chain), ఎలక్ట్రిక్ వైర్లు, స్విచ్, చిన్న మోటారు మాత్రమే ఉపయోగించాడు. బోరు హ్యాండిల్‌ను ఓ పైపు ద్వారా సైకిల్ పెడల్‌కు కనెక్ట్ చేశాడు. స్విచ్ ఆన్ చేయగానే సైకిల్ పెడల్‌తో కనెక్ట్ అయి ఉన్న హ్యాండిల్ ఆటోమేటిక్‌గా పైకి, కిందకు వెళ్తోంది. దాంతో నీళ్లు వచ్చేస్తున్నాయి.

Tomato Price: టమోటాల రేటేమో కానీ వీళ్ల క్రియేటివిటీ మాత్రం పీక్స్‌కు వెళ్లిపోయిందిగా.. ఓ వ్యక్తి 2 కిలోల టమోటాలు కొని..!

ఈ జుగాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. 4.25 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``పూర్తిగా ఇండియన్ ఆలోచన``, ``ఇలాంటి ఆలోచనను దేశం దాటి వెళ్లనివ్వకూడదు``, ``ఇలాంటి ఐడియాలు భారతీయులకే వస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-10T18:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising