ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: జిప్ వేశాం కదా.. బ్యాగు భద్రంగా ఉంటుందనుకుంటున్నారా.. లాక్ చేసిన బ్యాగును క్షణాల్లో ఎలా తెరిచాడో చూస్తే..

ABN, Publish Date - Dec 23 , 2023 | 09:03 PM

పెద్ద పెద్ద ఇళ్లు, తాళాలు వేసిన బీరువాలు, పటిష్ట సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా కొందరు దుండగులు ఈజీగా చోరీలకు పాల్పడుతుంటారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా...

పెద్ద పెద్ద ఇళ్లు, తాళాలు వేసిన బీరువాలు, పటిష్ట సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా కొందరు దుండగులు ఈజీగా చోరీలకు పాల్పడుతుంటారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇల్లు మొత్తం లూటీ చేసేయడం చూస్తూ ఉంటాం. కొందరు ప్రయాణ సమయాల్లో లాక్ చేశాం కదా అని.. బ్యాగులను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటారు. అయితే ఇలాంటి బ్యాగులను కూడా ఈజీగా తెరవచ్చని ఓ వ్యక్తి చేసి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జిప్ లాక్ చేసిన బ్యాగును క్షణాల్లో తెరవడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు లగేజీ బ్యాగులతో వెళ్తుండగా.. ఓ వ్యక్తి వారిని ఆపి ప్రయాణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తాడు. ఇందులో భాగంగా జిప్ లాక్ చేసిన బ్యాగును (man opened zipper bag with pen) తెరిచి వారందరికీ షాక్ ఇస్తాడు. ఇందుకోసం అతను ఓ పెన్ను తీసుకుని లాక్ చేసిన జిప్ మధ్యలో గుచ్చుతాడు. తర్వాత అటూ, ఇటూ కదపగా ఆశ్చర్యకరంగా జిప్ తెరుచుకుంటుంది.

Energy Food: త్వరగా అలసిపోతున్నారా.. అయితే ఈ ఐదింటినీ తీసుకుంటే కొత్త శక్తి వచ్చినట్లే..

తర్వాత బ్యాగులోని వాటర్ బాటిల్‌ని బయటికి తీసి, దొంగలు ఎలా చోరీ చేస్తారో వివరిస్తాడు. చివరకు యథావిధిగా మళ్లీ జిప్ వేసేస్తాడు. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు చోరీ చేసేస్తారంటూ వారికి వివరిస్తాడు. విలువైన వస్తువులు బ్యాగులో ఉన్న సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! బ్యాగు జిప్‌ను ఇలాక్కూడా ఓపెన్ చేయొచ్చా’’.. అంటూ కొందరు, ‘‘ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Wife: రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు లోపల నుంచి వినిపించిన శబ్ధాలు.. భార్యపై జరుగుతున్న దారుణాన్ని చాటుగా చూసి కూడా..

Updated Date - Dec 23 , 2023 | 09:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising