Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో కిచెన్ చిమ్నీని ఆర్డర్ ఇచ్చాడో వ్యక్తి.. పార్శిల్ ఇంటికి వచ్చాకా ఓపెన్ చేస్తే కనిపించిన దృశ్యం చూసి..!
ABN, First Publish Date - 2023-11-01T11:37:03+05:30
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయం ఆదా చేసే ఉద్దేశంతో 'ఆన్‌లైన్ షాపింగ్' (Online Shopping) వైపు మొగ్గు చూపుతున్నారు. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఆన్‌లైన్ వేదికగా చిటికెలలో దొరికిపోతుండడంతో ఆన్‌లైన్ షాపింగ్ అనేది జనాలకు చాలా ఈజీ అయిపోయింది.
Flipkart: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయం ఆదా చేసే ఉద్దేశంతో 'ఆన్‌లైన్ షాపింగ్' (Online Shopping) వైపు మొగ్గు చూపుతున్నారు. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఆన్‌లైన్ వేదికగా చిటికెలలో దొరికిపోతుండడంతో ఆన్‌లైన్ షాపింగ్ అనేది జనాలకు చాలా ఈజీ అయిపోయింది. తద్వారా ప్రత్యేకంగా షాపింగ్ కోసం గంటల కొద్ది సమయం వృధా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. మనకు కావాల్సిన వస్తువులను సెర్చ్ చేయడం, ఆ తర్వాత ఆర్డర్ పెట్టుకోవడమే. దీనికోసం ఎన్నో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉండనే ఉన్నాయి. అందులోనూ పండగల సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటాయి. ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ అయితే ఇలాంటి విషయాలలో చాలా ముందు ఉంటాయి.
Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!
ఇలాంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు డబ్బు, సమయం ఆదా అవుతుందని భారీ మొత్తంలోనే కస్టమర్లు తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మిస్‌ప్లేస్‌మెంట్స్ అవుతుంటాయి. ఒకటి ఆర్డర్ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చూశాం కూడా. ఫోన్లు ఆర్డర్ చేస్తే బిస్కెట్లు, రాళ్లు వంటివి పార్శిల్స్‌లో వచ్చాయి. అలాగే మరికొన్ని సందర్భాల్లో పాడయిపోయిన వస్తువులు వచ్చిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. తాజాగా ఓ కస్టమర్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో కిచెన్ చిమ్నీని ఆర్డర్ చేశాడు. తీరా.. ఇంటికి వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూసి షాకయ్యాడు. అందులోని చిమ్నీ పూర్తిగా పగిలిపోయి ఉంది. ఈ ఘటనతో కంగుతిన్న అతడు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
MMA Match Video: 19 ఏళ్ల యువతితో 50 ఏళ్ల మహిళ ఫైటింగ్.. రింగ్‌లో ఎదురుగా కొడుకు మాజీ ప్రేయసి.. అసలెవరు గెలిచారంటే..!
మైక్రోబ్లాగింగ్ సైట్ 'ఎక్స్' (ట్విటర్) లో అక్టోబర్ 18న @tomplayjr అనే యూజర్ తన ఆర్డర్ తాలూకు ఫొటోలు, వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. అక్టోబర్ 6న తనకు ఆ ఆర్డర్ డెలివరీ అయినట్లు పేర్కొన్నాడు. తీరా.. పార్శిల్ ఓపెన్ చేసి చూడగా అది పూర్తిగా పాడయిపోయి ఉంది. ఈ విషయాన్ని వెంటనే ఆయన ఫ్లిప్‌కార్ట్ దృష్టికి తీసుకెళ్లాడు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదట. 13 రోజులు గడుస్తున్న తనకు సదరు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా తనకు ఎలాంటి సహాయం అందలేదని వాపోయాడు. ఇక ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారడంతో చివరికి ఫ్లిప్‌కార్ట్ సంస్థ స్పందించిందట. కస్టమర్‌ను క్షమాపణ కోరడంతో పాటు వీలైనంత త్వరగా మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు అతడు తన ట్విటర్ పోస్టులో పేర్కొన్నాడు. చివరికి 25 రోజల తర్వాత తన సమస్య పరిష్కారమైనట్లు అక్టోబర్ 31న మరో పోస్టులో ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. పగిలిన ఆ చిమ్నీని రిటర్న్ తీసుకెళ్లడంతో పాటు రిఫండ్ కూడా చేసినట్లు తెలిపాడు. ఇదిలాఉంటే.. ఇటీవల ఇదే మాదిరిగా ఓ వ్యక్తి రూ.లక్ష విలువైన సోనీ టీవీని ఆర్డర్ చేస్తే బదులుగా మరో టీవీ డెలివరీ అయ్యింది. దాంతో ఆ వ్యక్తి కూడా తన బాధను ఇలాగే ట్విటర్ వేదికగానే పంచుకోవడం, ఫ్లిప్‌కార్ట్ వారు స్పందించడం, చివరికి అతనికి వేరే టీవీని డెలివరీ చేయడం జరిగింది.
Viral Video: ఇంత టాలెంట్ ఏంటి తల్లీ..? ఈగ సినిమాలో సమంతను మించిపోయేలా ఉందిగా.. టీ వడబోసుకునేందుకు ఏం చేసిందో చూస్తే..!
Updated Date - 2023-11-01T11:37:03+05:30 IST