ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రూ.20 వేలతో అమెజాన్‍లో షాపింగ్ చేస్తే.. రూ.10 విలువైన టూత్‍పేస్ట్ డెలివరీ..!

ABN, First Publish Date - 2023-12-11T13:18:24+05:30

అమెజాన్‍లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురయింది. దాదాపుగా 20 వేల రూపాయలు పెట్టి ఓ ఎలక్ట్రానిక్ వస్తువును ఆర్డర్ ఇస్తే.. చివరకు కేవలం 10 రూపాయల విలువైన టూత్‍పేస్ట్ ను డెలివరీ చేశారు.

అమెజాన్‍లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురయింది. దాదాపుగా 20 వేల రూపాయలు పెట్టి ఓ ఎలక్ట్రానిక్ వస్తువును ఆర్డర్ ఇస్తే.. చివరకు కేవలం 10 రూపాయల విలువైన టూత్‍పేస్ట్ ను డెలివరీ చేశారు. ఆర్డర్ వచ్చింది కదా అని ఆశగా ఆ పార్శిల్ ను ఓపెన్ చేసిన కస్టమర్.. అందులో ఉన్న వస్తువును చూసి అవాక్కయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

యశ్ ఓఝా అనే ఓ కస్టమర్ 19,990 రూపాయల విలువైన సోనీ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ను అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లోనే అమెజాన్ నుంచి ఓ పార్శిల్ డెలివరీ అయింది. తాను ఆర్డర్ ఇచ్చిన హెడ్ ఫోన్సే వచ్చాయన్న ఉత్సాహంతో వీడియో రికార్డ్ చేస్తూనే ఆ పార్శిల్ ను ఓఝా ఓపెన్ చేయడం మొదలు పెట్టాడు. అయితే హెడ్ ఫోన్స్ ఉండాల్సిన బాక్సులో 10 రూపాయల విలువైన ఓ టూత్ పేస్ట్ ఉండటం చూసి కంగుతిన్నాడు. పార్శిల్ లో ఉన్న బిల్లు రిసిప్టు పైన కూడా హెడ్ ఫోన్స్ అనే రాసి ఉన్నప్పటికీ.. అందులో టూత్ పేస్ట్ ఉందని చెబుతూ తన సోషల్ మీడియా అకౌంట్ లో వీడియోను పోస్ట్ చేశాడు. సోనీ హెడ్ ఫోన్స్ పార్శిల్ ను అన్ బాక్సింగ్ చేస్తే టూత్ పేస్ట్ బయటపడిందంటూ నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అయింది.

దీంతో ఈ ఘటనపై అమెజాన్ స్పందించింది. ‘జరిగిన తప్పునకు చింతిస్తున్నాము. పొరపాటున వేరే వస్తువు డెలివరీ అయింది. కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన వస్తువును డెలివరీ జరిగేలా చర్యలు తీసుకుంటాము.’ అంటూ అమెజాన్ నుంచి యశ్ కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అతడిని ఫోన్ ద్వారా అమెజాన్ బృందం సంప్రదించింది. త్వరలోనే మీ ఆర్డర్ ను మళ్లీ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మొత్తానికి కాస్త ఆలస్యంగా అయినా తాను ఆర్డర్ ఇచ్చిన వస్తువు డెలివరీ అవుతుందేమోనంటూ యశ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇదిలా ఉండగా గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. 90 వేల రూపాయల విలువైన కెమెరా లెన్స్ ను ఓ వ్యక్తి ఆర్డర్ ఇస్తే చివరకు క్వినోవా గింజలను డెలివరీ చేసిన ఘటన కూడా కొద్ది రోజుల క్రితమే జరగడం గమనార్హం.

Updated Date - 2023-12-11T13:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising