IRCTC: నా జీవితంలో ఇలాంటి ఫుడ్ తినలేదు... మీ లాంటి ప్రధాని మా అదృష్టం మోదీజీ...
ABN, First Publish Date - 2023-02-17T15:08:03+05:30
రైళ్లలో ఇచ్చే ఫుడ్ చెత్తగా ఉందని ఇటీవలి కాలంలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం రైళ్లలో ఇచ్చే ఆహారం అద్భుతంగా ఉందని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వెనుక అసలు కథేంటంటే..
ఆహా.. రైలు ప్రయాణంలో అద్భుత ఆహారం అందించినందుకు IRCTCకి, ప్రధాని నరేంద్రమోదీకి (PM Modi) ధన్యవాదాలు. నా మొత్తం జీవితంలో ఇలాంటి ఆహారం తినలేదు. మీ లాంటి ప్రధాని ఉండడం మా అదృష్టం మోదీజీ..
ఇదీ కేరళకు చెందిన ఓ వ్యక్తి చేసిన ట్వీట్. అదేంటి రైళ్లలో ఇచ్చే ఫుడ్ (Food In Trains) చెత్తగా ఉందని ఇటీవలి కాలంలో వరుస ఫిర్యాదులు వస్తుంటే ఈ వ్యక్తి ఏంటి ఇలాంటి ట్వీట్ చేశాడు అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది అసలైన మేటర్.
కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రారంభిస్తున్న వందే భారత్ రైళ్లలో (Vande Bharat Trains ) ఆహారం నాసిరకంగా ఉందని అందరూ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు రైల్వే శాఖకు (Indian Railway), కేంద్రానికి చికాకు కలిగిస్తున్నాయి. ఆ విమర్శలను కౌంటర్ చేస్తూ దీంతో కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి IRCTC ప్రేమయంతో రైళ్లలో అందిస్తున్న ఆహారం చాలా బాగుందంటూ ట్వీట్లు చేస్తున్నారు. తమ ట్వీట్లకు బయటి రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ ఫొటోలను యాడ్ చేసి ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. తాజాగా @R_Rajmohan అనే వ్యక్తి పైన పేర్కొన్న విధంగా చేసిన వ్యంగ్య ట్వీట్ (Sarcastic Tweet) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్వీట్‌తో పాటు రాజ్‌మోహన్ షేర్ చేసిన ఫొటోలో మాంసాహారం ప్లేట్ కనిపిస్తోంది. ఈ ట్వీట్‌పై పలువురు వ్యక్తులు తమదైన శైలిలో స్పందించారు (Trolling on Food in Trains).
మోదీజీ, వైష్ణవ్ జీ ఆధ్వర్యంలో నడిచే రైల్వే శాఖ రైళ్లలో అశుద్ధమైన మాంసాహారాన్ని (Non-Veg) వడ్డించదని, పూర్తి శాఖాహారాన్నే ఇస్తారని, ఈ ట్వీట్ ఫేక్ అని, కేరళకు చెందిన ఈ వ్యక్తి అర్భన్ నక్సల్ అని గుర్తు తెలియని ఓ వ్యక్తి విమర్శించాడు. అలాగే కొందరు రాజ్‌మోహన్ వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని అతడికి మద్దతుగా ట్వీట్లు చేశారు. రాజ్‌మోహన్ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేక చాలా మంది నిజంగానే రైళ్లలో అద్భుత ఆహారం పెడుతున్నారని నమ్మేస్తారేమోనని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. అలాగే 2014 తర్వాతే (మోదీ ప్రధాని అయ్యాక) తాను ఇలాంటివి తినడం ప్రారంభించానని, అంతకు ముందు రుషిలా జీవించానని ఒకరు పేర్కొన్నారు. ఏది ఏమైనా రైల్వే శాఖను, రైళ్లలో అందించే ఆహారాన్ని అద్భుతంగా మార్చిన ప్రధాని మోదీకి రుణపడి ఉండాలని మరొకరు కామెంట్ చేశారు.
Updated Date - 2023-02-17T15:13:41+05:30 IST