ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake vs Gun Man: అర్రెర్రే.. ఇలా జరిగిందేంటి..? పామును చంపేద్దామని గన్ను తీసుకుని గురిపెట్టి కాల్చితే..!

ABN, First Publish Date - 2023-09-06T16:19:27+05:30

విష సర్పాలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొందరు, వాటిని పట్టుకుని అందరి ముందు హీరోలా బిల్డప్ ఇవ్వాలని మరికొందరు చివరకు ప్రాణాలకు తెచ్చుకుంటుంటారు. కొందరు ఫుల్‌గా మద్యం సేవించి.. పామును పట్టుకోవడమే కాకుండా దాని తలను నోట్లో పెట్టుకుని చివరకు ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కూడా చూశాం. ఇలాంటి..

ప్రతీకాత్మక చిత్రం

విష సర్పాలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొందరు, వాటిని పట్టుకుని అందరి ముందు హీరోలా బిల్డప్ ఇవ్వాలని మరికొందరు చివరకు ప్రాణాలకు తెచ్చుకుంటుంటారు. కొందరు ఫుల్‌గా మద్యం సేవించి.. పామును పట్టుకోవడమే కాకుండా దాని తలను నోట్లో పెట్టుకుని చివరకు ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కూడా చూశాం. ఇలాంటి వార్తలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పామును చంపేందుకు తుపాకీ గురిపెట్టాడు. సరిగ్గా పాముకు గురిపెట్టి కాల్చడంతో చివరకు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ బుండి జిల్లా (Rajasthan Bundi District) భోజసర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఇటీవల ఓ రోజు అతను ఇంట్లో ఉండగా.. బయట నుంచి గట్టిగా కేకలు వినిపించాయి. దీంతో ఉలిక్కిపడ్డ ప్రసాద్.. పరుగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. వచ్చి చూడగా.. ఎదురుగా ఓ నాగు పాము (Cobra) బుసలు కొడుతూ కనిపించింది. అది ఓ ఇంట్లోకి వెళ్లడం చూసి చుట్టు పక్కల వారు కేకలు పెట్టారు. ఎలాగైనా పామును చంపమంటూ అందరూ కోరడంతో ప్రసాద్.. వేగంగా ఇంట్లోకి వెళ్లి పాత డబుల్ బ్యారల్ గన్ తీసుకొచ్చాడు. తుపాకిలో బుల్లెట్ చొప్పించి (pointed the gun at the snake) పాము వైపు గురి పెట్టాడు. సరిగ్గా టార్గెట్ చూసుకుని ట్రిగ్గర్ నొక్కాడు.

Viral: విమానం ప్రయాణం మొదలైన 2 గంటలకు బయటపడిన నిజం.. భయంతో యూటర్న్ తీసుకున్న పైలెట్.. అసలు కథేంటంటే..!

అయితే బుల్లెట్ బయటికి చొచ్చుకెళ్లి పామును తాకాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా తుపాకీ పైభాగంలో పెద్ద శబ్ధం (gun Exploding) వచ్చి అక్కడే పేలింది. ఊహించని ఈ ఘటనలో ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ శబ్ధానికి పాము అక్కడి నుంచి ఇంట్లోకి దూరింది. తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఈ నాగుపాము.. కొంపతీసి నాగదేవత కాదు కదా!’’.. అంటూ కొందరు, ‘‘పామును చంపాలని అనుకోకుండా.. పట్టుకుని అడవిలో వదిలి ఉంటే ఈ సమస్య వచ్చుండేది కాదు కదా’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సింహాలను చూసి ఆగిపోయిన వాహనాలు.. ఆరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా సడన్‌గా రావడంతో..

Updated Date - 2023-09-06T16:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising