Viral Video: వీడేంట్రా బాబూ.. టీ తాగమంటూ యువతికి ఏకంగా నోట్ల కట్ట ఇచ్చేశాడు.. ఖరీదైన కార్ల షోరూంలో ఇతడు చేసిన పనికి..
ABN, First Publish Date - 2023-07-12T21:53:13+05:30
కొందరు ధనవంతుల నిర్వాకం కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని సార్లు ఆగ్రహంం తెప్పిస్తుంటుంది. వారు చేసే పనిలో అడుగడుగునా డాబూ, దర్పం కనిపిస్తుంటుంది. అలాగే మరికొందరు ఆ దర్పం చూసుకుని ఎదుటి వారిని చులకనగా చూస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
కొందరు ధనవంతుల నిర్వాకం కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని సార్లు ఆగ్రహంం తెప్పిస్తుంటుంది. వారు చేసే పనిలో అడుగడుగునా డాబూ, దర్పం కనిపిస్తుంటుంది. అలాగే మరికొందరు ఆ దర్పం చూసుకుని ఎదుటి వారిని చులకనగా చూస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఖరీదైన కార్ల షోరూంలోకి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ పని చేసే యువతికి టీ తాగమంటూ నోట్ల కట్ట ఇచ్చేశాడు. అంతటితో ఆగకుండా షోరూంలో ఇతడు చేసిన పనికి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు ఇతడిపై కేసులు నమోదు చేశారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. యూఏఈ (United Arab Emirates) లోని ఓ లగ్జరీ కార్ల షోరూంలో (Luxury car showroom) ఈ ఘటన చోటు చేసుకుంది. దుబాయ్ షేక్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి.. ఖరీదైన కార్ల షోరూంలోకి వెళ్తాడు. ఇద్దరు అనుచరులు కరెన్సీ నోట్ట కట్టలను ఓ ట్రేపై పెట్టుకుని.. అతడిని అనుసరిస్తూ లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన సదరు వ్యక్తి ఎదరుగా ఉన్న యువతిని (young woman) ‘‘హే కెప్టెన్, మీ బాస్ ఎక్కడ’’ అని అడుగుతాడు. అటు వైపు ఉన్నాడంటూ ఆమె చూపించగానే.. దగ్గరికి వెళ్లి ‘‘వెళ్లి టీ తాగు’’.. అంటూ నోట్ల కట్ట (currency notes Bundle) చేతిలో పెడతాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత లోపలికి వెళ్లి.. ఖరీదైన కార్లు చూపించమంటూ సిబ్బందికీ నోట్ల కట్టలను చిల్లర పంచినట్లు పంచేస్తాడు.
Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?
ఈ క్రమంలో సిబ్బంది.. రెండు మిలియన్ దిర్హామ్‌ల (Two million dirhams) విలువైన కారును చూపించగా.. ‘‘అది మా డ్రైవర్ ఉపయోగిస్తాడు.. అంత చీఫ్ కారు నాకొద్దు.. ఇంకేదైనా చూపించు’’.. అంటూ అహంకారంగా మాట్లాడతాడు. ఇలా షోరూంలో సమాధానం చెప్పిన వారందరికీ నోట్ల కట్టలు విరిరేస్తూ హల్‌చల్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసుల వరకూ వెళ్లింది. యూఏఈ చట్టాల ప్రకారం సదరు వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సామాజిక నిబంధనలు, విలువలను గౌరవించకపోవడంపై ఇతడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ సీరియస్ అయింది. కాగా, ఇతడి నిర్వాకంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ‘‘డబ్బు ఉందన్న అహకారంతో.. ఇలా చేయడం చాలా తప్పు’’ అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-07-12T21:53:13+05:30 IST