Viral News: రెండు దోశలు, ప్లేట్ ఇడ్లికి రూ.1000 బిల్.. అదేంటని అడిగిన కస్టమర్‌కు రెస్టారెంట్ షాకింగ్ రిప్లై!
ABN, First Publish Date - 2023-12-07T13:45:50+05:30
Viral: గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్ తమవద్ద టీఫిన్ చేసిన ఒక కస్టమర్‌కు కలలో కూడా ఊహించని బిల్లుతో షాక్ ఇచ్చింది. కేవలం రెండు దోశలు, ప్లేట్ ఇడ్లికి ఏకంగా రూ.1000 వసూలు చేసింది.
Viral: గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్ తమవద్ద టీఫిన్ చేసిన ఒక కస్టమర్‌కు కలలో కూడా ఊహించని బిల్లుతో షాక్ ఇచ్చింది. కేవలం రెండు దోశలు, ప్లేట్ ఇడ్లికి ఏకంగా రూ.1000 వసూలు చేసింది. ఈ విషయాన్ని కస్టమర్ తన 'ఎక్స్' (ట్విటర్) ఖాతా ద్వారా నెట్టింట పెట్టడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. ఆశిష్ సింగ్ అనే ట్విటర్ యూజర్‌కు ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. గురుగ్రామ్ పరిధిలోని అవెన్యూ 33 (32nd Avenue) లో ఉండే కర్నాటిక్ కేఫ్ (Carnatic Cafe) కు ఇటీవల సింగ్ టీఫిన్ చేసేందుకు వెళ్లాడు. అక్కడ రెండు దోశలు, ప్లేట్ ఇడ్లి తిన్నాడు. టీఫిన్ చేసిన అర్ధ గంట తర్వాత అతని చేతికి బిల్లు వచ్చింది. అది చూసిన సింగ్‌కు మైండ్‌బ్లాక్ అయింది. బిల్ వచ్చేసి అక్షరాల వెయ్యి రూపాయలు ఉండడంతో మనోడికి నోటమాట రాలేదు.
ఇది కూడా చదవండి: Viral: 148 దేశాలను చూపిస్తామని రూ.26 లక్షలను తీసుకుని.. చివరకు ఆ మహిళను రోడ్డున పడేశారు..!
ఇదేంటని అడిగితే.. 'మావద్ద అంతే.. అన్ని కాస్ట్లీగానే ఉంటాయి. వచ్చే ముందే తెలుసుకుని రావాలని' దురుసుగా మాట్లాడారట అక్కడ పనిచేసేవారు. దాంతో చేసేదేమిలేక వెయ్యి రూపాయలు చెల్లించి రెస్టారెంట్ నుంచి బయటపడ్డాడు సింగ్. ఆ తర్వాత తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని ట్విటర్ ద్వారా బయటపెట్టాడు. దీంతో ఇప్పుడు దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 'భయ్యా.. నీవు దోసకే కాదు.. నీవు కూర్చున్న కాస్ట్లీ ప్లేస్‌కు కూడా చెల్లించావు', 'భాయ్.. నీవు గురుగ్రామ్ నుంచి సిమ్లాకు వచ్చేయ్. బస్ చార్జీ రూ.500 మాత్రమే. కేవలం రూ.90 చెల్లిస్తే చాలు అద్భుతమైన మసాల దోశ తినొచ్చు', 'బెంగళూరులో అదే స్టఫ్, మంచి రుచితో కూడిన దోశ కేవలం 100 రూపాయలు మాత్రమే' అని నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-07T13:45:52+05:30 IST