Marriage: నువ్వు ప్రేమించింది ఇలాంటోడినా తల్లీ.. ఆస్పత్రిలో తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ భర్త ఎస్కేప్.. చివరకు..!
ABN, First Publish Date - 2023-12-05T13:50:37+05:30
ప్రేమించి తల్లిదండ్రులను కాదని మరీ అతడిని పెళ్లి చేసుకుంటే.. చివరకు ఆ అమ్మాయికి జరిగిందిదీ..
అమ్మాయిలు తాము ప్రేమించిన వ్యక్తులు చాలా మంచోళ్లని నమ్ముతారు. ఇంకా చెప్పాలంటే అంత మంచివాళ్లు లోకంలో ఉండరని కూడా అనుకుంటారు. అందుకే ప్రేమించిన వాడితోనే జీవితమని కని పెంచిన తల్లిదండ్రులను కూడా సునాయాసంగా వదిలేసి వెళ్లిపోతారు. కానీ కొందరు మగమహారాజులు అమ్మాయిల నమ్మకాన్ని వమ్ము చేస్తారు. జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతారు. పాపం ఈ అమ్మాయికి కూడా అదే ఎదురయ్యింది. బెంగుళూరులో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బెంగుళూరు(Bengaluru) నగరం కేఆర్ పురం సమీపంలో అనూష అనే 23ఏళ్ల నవ వధువు ఆత్మ హత్యకు పాల్పడింది. సింగయ్యనపాళ్యంలోని ఓ ఫ్యూయల్ స్టేషన్ లో పనిచేసే ప్రవీణ్(23) అనే అతనితో అనూషకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది పాటూ వీరు ప్రేమలో ఉన్నారు. వారిద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్లు అంగీకరించరనే కారణంతో అనూష ప్రవీణ్ తో కలసి పారిపోయి 2నెలల కిందట పెళ్లి చేసుకుంది. తమ కూతురు పారిపోయి పెళ్లి చేసుకున్నా సరే అనూష తల్లిదండ్రులు వారిని ఏమీ అనలేదు. కానీ అకస్మాత్తుగా అనూష తన ఇంట్లో ఉరి వేసుకుంది. అది గమనించిన ప్రవీణ్ ఆమెను వైదేహి ఆసుపత్రికి తరలించాడు. వైదేహి ఆసుపత్రిలో అనూషను చెక్ చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు. అయితే అనూషను ఆసుపత్రిలో అడ్మిట్ చేసేటప్పుడు అతని వివరాలు అడిగారు. తాను ఆమె భర్తనని చెప్పి వారికి తప్పుడు పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుండి పరారయ్యాడు. ఆసుపత్రి సిబ్బంది అతనిచ్చిన నెంబర్ కు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన లేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Jilumol Mariet: ఎవరీ యువతి.. ఏకంగా ముఖ్యమంత్రే పిలిచి మరీ ఈ యువతికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉంది..!
పోలీసులు ఆసుపత్రికి చేరుకుని అనూష తల్లిదండ్రులను పిలిపించారు. పెళ్లైన కొన్ని రోజులకే కూతురు మరణించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అనూష పెళ్లి కోసం 32సెంట్ల స్థలం, పెళ్లికోసం బంగారం తీసిపెట్టారు ఆమె తల్లిదండ్రులు. కానీ పారిపోయి పెళ్లిచేసుకోవడంతో వారు సైలెంట్ అయ్యారు. ప్రవీణ్ ఇంట్లో కట్నం రాలేదనే కారణంతో అనూషను వేధించేవారని అనూష తల్లి పోలీసులకు తెలిపింది. నెల క్రితం అనూష తనకు ఫోన్ చేసి కట్నం కోసం వేధిస్తున్నారనే విషయం చెబుతూ ఏడ్చిందని కూడా ఆమె పేర్కొంది. ఆమె పేరున స్థలం, బంగారం ఉందని తెలుసుకున్న ప్రవీణ్, అతని కుటుంబ సభ్యులు తమ కూతుర్ని వేధించారని, వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అనూష తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
ఇది కూడా చదవండి: చపాతీలు, బెల్లం.. ఈ వింత కాంబినేషన్ వల్ల లాభమేంటంటే..!
Updated Date - 2023-12-05T13:50:39+05:30 IST