Marriage Tips: అమ్మాయిలూ.. పెళ్లి చూపుల్లోనే అబ్బాయిని ఈ ప్రశ్న అడిగేయండి.. ఇలా చెప్పినోళ్లనే పెళ్లాడండి..!
ABN , First Publish Date - 2023-09-15T12:14:21+05:30 IST
పెళ్లి తరువాత అబ్బాయిల వల్ల ఏ సమస్య ఎదురైనా నష్టపోయేది అమ్మాయిలే. అందుకే పెళ్లికి ముందే అబ్బాయి గురించి పూర్తీగా తెలుసుకోవాలని అంటుంటారు. కేవలం అనడమే కాదు పెళ్లిచూపుల్లోనే అబ్బాయిలను ఒక ప్రశ్న అడిగెయ్యమంటున్నారు.
పెళ్ళి అనేది జీవితకాల నిర్ణయం. ఎవరూ విడిపోయే ఉద్దేశంతో పెళ్ళిచేసుకోరు. కానీ పెళ్ళి తరువాత కాలం గడిచేకొద్ది మనుషుల స్వభావం లోతుగా అర్థమవుతుంది. పెళ్లి తరువాత అబ్బాయిల వల్ల ఏ సమస్య ఎదురైనా నష్టపోయేది అమ్మాయిలే. అందుకే పెళ్లికి ముందే అబ్బాయి గురించి పూర్తీగా తెలుసుకోవాలని అంటుంటారు. కేవలం అనడమే కాదు పెళ్లిచూపుల్లోనే అబ్బాయిలను ఒక ప్రశ్న అడిగెయ్యమంటున్నారు. ఆ ప్రశ్నకు అబ్బాయి ఇచ్చే సమాధానాన్ని బట్టి అబ్బాయిని అంచనా వేయచ్చట. ఈ విషయాన్ని స్వయానా ఓ ఐఏఎస్ అధికారి చెప్పడంతో ఈ విషయం వైరల్ గా మారింది. అసలు అబ్బాయిలను అడగాల్సిన ప్రశ్న ఏంటి? దీని గురించి చెప్పింది ఎవరు? వివరంగా తెలుసుకుంటే..
డా. వికాస్ దివ్యకీర్తి(Dr. Vikas divyakirti) 1996 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన హోం మంత్రిత్వ శాఖలో 1సంవత్సరం పనిచేసిన తరువాత తన జాబ్ కు రిజైన్ చేశారు. ఆ తరువాత రచయితగా, ఉపాధ్యాయుడిగా, ప్రేరణాత్మక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. దృష్టి ఐఏఎస్(Drishti IAS) శిక్షణా కేంద్రం స్థాపించాడు. ఇక్కడ కేవలం యూపిఎస్సికి మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన విషయాలు కూడా భోదిస్తారు. అమ్మాయిలు పెళ్ళి చూపుల సమయంలోనే అబ్బాయిని 'మీరు చివరిసారిగా ఏడ్చిన సంధర్భం ఏది?' అనే ప్రశ్నను అడగాలట. ఈ ప్రశ్నకు సమాధానంగా అబ్బాయి 'నేను ఎప్పుడూ ఏడవలేదు. చిన్నప్పుడెప్పుడో ఏడిచాను అంతే' అని సమాధానం చెబితే ఆ అబ్బాయి ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, అతని సంపాదన ఎంతైనా, అతను ఎంత అందంగా ఉన్నా.. అతన్ని ఎట్టి పరిస్థితులలోనూ పెళ్ళి చేసుకోకండి అని ఆయన అంటున్నారు. అంటే పరిస్థితులను బట్టి ఏడ్చిన అబ్బాయిలను పెళ్ళిచేసుకోమన్నది ఆయన సలహా.
100 Years Life: ఈ 5 రకాల ఆహార పదార్థాలను తినండి చాలు.. 100 ఏళ్ల లైఫ్‌కు అవే గ్యారెంటీ..!
చాలా సంవత్సరాలుగా ఏడవని వ్యక్తి చాలా కఠినంగా ఉంటాడు. అతని మనసు ఒకానొక దశలో బండరాయిలా ఉంటుంది. సహజంగానే ఏవైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మగపిల్లలు కన్నీరు పెట్టుకుంటారు. కానీ మగాడివై ఉండి ఏడుస్తావేంటి అంటూ చిన్నతనం నుండే ఎమోషన్స్ కు దూరం చేస్తారు.ఈ కారణంగా వారిలో భావోద్వేగాలు బయటకు రాకుండా అణిగిపోతాయి. అలాంటి వారు ఇతరుల భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోరు. భావోద్వేగానికి గురైనప్పుడు ఆక్సిటోసిన్, ఎండార్సిన్ రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి కన్నీటినికి కారణమవుతాయి. తద్వారా మనిషి మనసును తేలికపరుస్తాయి. ఏడవడం మానసిక బాధను తగ్గిస్తుంది. అందుకే జీవితంలో ఏడవలేదు అని చెప్పే అబ్బాయిలను మాత్రం అస్సలు పెళ్లిచేసుకోవద్దని చెబుతున్నారు.