డిప్రెషన్ కు మందులు వాడుతున్నారా? అయితే మీరు చాలా తప్పు చేస్తున్నారు..
ABN, First Publish Date - 2023-03-06T13:15:32+05:30
ఎన్ని మందులు వాడినా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఈ డిప్రెషన్ పూర్తిగా వదిలిపోదు. ఇలాంటి డిప్రెషన్ కు
ఇప్పటికాలంలో ఎక్కడ చూసినా డిప్రెషన్ కేసులే.. కొందరు ఈ మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎన్ని మందులు వాడినా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఈ డిప్రెషన్ పూర్తిగా వదిలిపోదు. ఇలాంటి డిప్రెషన్ కు మందులు పరిష్కారం కాదట.
మనం వాడే మందులు ఏవైనా శరీరంలో నాడీకణాలకు విశ్రాంతిని ఇచ్చి మనల్ని కొద్దిసేపు మత్తులోకి జారవిడుస్తాయి. ఆ సమయంలో శరీరంలో మరమ్మత్తులు జరుగుతాయి. దీని వల్ల మన శరీరంలో నొప్పులు, గాయాలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ డిప్రెషన్ అనేది మానసిక సమస్య. అది మనిషి ఆలోచనలు, తన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా ప్రభావితమవుతుంది. దీనికి మందులకంటే గొప్ప పరిష్కారంగా వ్యాయామం తోడ్పడుతుంది. డిప్రెషన్ కోసం మందులు వాడినప్పుడు అవి శరీరం మీద చూపించే ప్రభావం కంటే వ్యాయామమం 1.5రెట్లు ఎ్కకువగా ప్రభావం చూపిస్తుంది. శరీరంలో కండరాలు, నాడీకణాలు విశ్రాంతి తీసుకోవడానికి వ్యాయామం చక్కని మార్గం. శరీరం అలసిపోవడం వల్ల మెదడు కూడా ఆలోచనల రద్దీ తగ్గించుకోగలుగుతుంది. మానసిక ఒత్తిడి ఉన్న కొందరిని వ్యాయామంలో పాల్గొనేలా చేసి వారిలో మార్పులను గమనించారు. మందులు వాడుతున్న వారికంటే మంచి మార్పులు చోటుచేసుకున్నాయి.
Read also: పేరు మార్చుకుని పాకిస్తాన్ కు వెళ్ళాడు.. పాక్ ఆర్మీలో చేరాడు.. కానీ చివరికి ఏం జరిగిందంటే..
అంతే కాదండోయ్.. వ్యాయామంలో భాగంగా ప్రతిరోజూ 3500అడుగుల నడక మంచిదని వెల్లడించారు. దీనికి అదనంగా మరొక 500 అడుగులు జోడిస్తే గుండె సాధారణ నడక కంటే 15శాతం ఎక్కువ బలపడుతుందట. 55ఏళ్ళ వయసు దాటిన వారు రోజుకు 4500అడుగులు వేశారంటే గుండె సమస్యల ముప్పు 77శాతం తగ్గుతుంది.
Updated Date - 2023-03-06T13:15:32+05:30 IST