ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మెట్రో రైల్లో ఇవేం ఘోరాలు బాబోయ్.. స్కర్టులతో వచ్చి ప్రయాణీకుల మతి పోగొట్టిన కుర్రాళ్లు.. అమ్మాయిల్లాగే నడుస్తూ..

ABN, First Publish Date - 2023-04-21T11:26:42+05:30

సోషల్ మీడియలో (Social Media) రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు కొందరు వింత వేశాలు వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi Metro: సోషల్ మీడియలో (Social Media) రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు కొందరు వింత వేశాలు వేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే బరితెగించేస్తున్నారు. ఇక ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ అశ్లీలతకు అడ్డగా మారుతోంది. ఢిల్లీ మెట్రోలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలే దీనికి నిదర్శనం. మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు.

ఇటీవల ఓ యువ‌తి ఢిల్లీ మెట్రోలో కేవ‌లం మైక్రో మినీ స్కర్ట్‌తో ప్రత్యక్షమై తోటి ప్రయాణికులను షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ఆమె బికినీ డ్రెస్ చూసిన వారందరూ.. ఇదేం డ్రెస్ అంటూ నోరెళ్లబెట్టారు. ఆ యువతి వీడియో నెట్టింట బాగానే వైరల్ అయింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమికుల వీడియో కూడా తెగ హల్‌చల్ చేసింది. మెట్రోలో ప్రయాణికుల మధ్య ఆ ప్రేమికులు ముద్దులతో రెచ్చిపోయారు. ఈ ఘటన తాలూకు వీడియో కూడా బాగా వైరల్‌గా మారింది. ఇదే కోవలో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు నెట్టింట (Internet) బాగా వైరల్ అవుతోంది.

Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఇద్దరు యువకులు డెనిమ్ స్కర్టులతో (Denim Skirts) మెట్రో స్టేషన్‌లో ఎంట్రీ ఇవ్వడం మనం వీడియోలో చూడొచ్చు. అనంతరం వారిద్దరూ స్టేషన్‌లో కలియ తిరుగుతూ హల్‌చల్ చేశారు. అచ్చం అమ్మాయిల్లాగే నడుస్తూ.. అలా మెట్రో స్టేషన్ మొత్తం ఓ రౌండ్ వేసి, కొద్దిసేపటి తర్వాత వారు మెట్రో ట్రైన్ ఎక్కారు. అంతే.. అందులోని ప్రయాణీకులకు మతి పోయినంత పనైంది. ఇదెక్కడి చోద్యం అన్నట్టుగా ప్రయాణీకులు వారిని వింతగా చూస్తూ నోరెళ్లబెట్టారు. ఈ నెల 16న భవ్య కుమార్ అండ్ సమీర్ ఖాన్ (Bhavya Kumar and Sameer Khan) అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ (Video goes Viral) అవుతోంది. ఇప్పటికే వీడియోకు 32వేలకు పైగా లైక్స్ (Likes) వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: నీ మాటలు నిజమే బాసూ.. అంటూ ఆటో డ్రైవర్‌కు అనూహ్య మద్ధతు.. ఇంతకీ ఆటో వెనుక అతడు ఏం రాశాడంటే..

Updated Date - 2023-04-21T11:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising