Miss Russia:మిస్ యూనివర్స్ పోటీలో నుంచి తొలగించారు...రష్యా మిస్ అన్నా లిన్నికోవా సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-02-02T09:35:05+05:30
అందాల సుందరి అయిన మిస్ రష్యా అన్నా లిన్నికోవా తాజాగా సంచలన వ్యాఖ్యలు...
మాస్కో(రష్యా): అందాల సుందరి అయిన మిస్ రష్యా అన్నా లిన్నికోవా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.(Miss Russia) మిస్ యూనివర్స్ పోటీలో ఇతర పోటీదారులు తనను తప్పించారని రష్యా సుందరి(Anna Linnikova) ఆరోపించారు. రష్యా దేశానికి చెందిన ఓ పత్రికకు మిస్ రష్యా లిన్ని కోవా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. రాజకీయ జోక్యం వల్లనే తాను ఈ ఏడాది జనవరి 11వతేదీన న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన 71వ మిస్ యూనివర్స్ బ్యూటీ పోటీ(Miss Universe 2023 competition) నుంచి తొలగించారని లిన్ని ఆరోపించారు. తన మూలాలు తెలుసుకొని ఉక్రెయిన్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన అమ్మాయిలు తన నుంచి పారిపోయారని లిన్ని చెప్పారు. ఉక్రేనియన్ సుందరి విక్టోరియా అపనాసెంకో తనతో మాట్లాడటానికి ఇష్టపడలేదని రష్యా భామ వెల్లడించారు.
అమెరికా దేశం కూడా ఉక్రేనియన్ అభ్యర్థులకు అనుకూలంగా ఉందని లిన్ని పేర్కొంది.మిస్ యూనివర్స్ 2023 పోటీ యునైటెడ్ స్టేట్స్‌లో జనవరి 15వతేదీన ముగిసినా, ఈ పోటీ రష్యా అందాల సుందరికి ప్రతికూల అనుభవాలను అందించింది.‘‘నేను ఉక్రేనియన్ సోషల్ మీడియా వినియోగదారుల నుంచినిరంతర అవమానాలు, బెదిరింపులను ఎదుర్కొన్నాను. కేవలం నా జాతీయత కారణంగానే కొందరు పోటీదారులు తనను దూరం పెట్టారు’’ అని మిస్ రష్యా లిన్ని విమర్శించింది. కాగా ఉక్రెయిన్ సుందరి అపాసెంకో అదే సమయంలో మిస్ రష్యా చేసిన వాదనలను తిప్పికొట్టింది.సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న రష్యా సుందరి లిన్నికి ఇన్ స్టాగ్రాంలో 90వేలమంది ఫాలోయర్స్ ఉన్నారు.
Updated Date - 2023-02-02T09:58:29+05:30 IST