కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Monsoon Hair Fall: వర్షాకాలంలోనే కొందరికి ఎందుకిలా..? విపరీతంగా జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే..!

ABN, First Publish Date - 2023-07-21T16:39:15+05:30

వర్షాకాలంలో జుట్టు రాలిపోకుండా ఉండటానికి 7ఆహారాలు సూపర్ ఫుడ్స్ గా పనిచేస్తాయి.

Monsoon Hair Fall: వర్షాకాలంలోనే కొందరికి ఎందుకిలా..? విపరీతంగా జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే..!

జుట్టు గురించి ఆందోళన చెందేవారు వర్షాకాలం వచ్చిందంటే మరింత భయపడుతుంటారు. మిగిలిన కాలాల కంటే వర్షాకాలంలో జుట్టు చాలా తొందరగా జిడ్డుగా తయారవ్వడం, వాతావరణంలోని తేమ కారణంగా తలలో చుండ్రు, దురద, పుండ్లు ఏర్పడటం జరుగుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది. తద్వారా జుట్టు రాలడమనే సమస్య వర్షాకాలంలో ఎక్కువ అవుతుంది. చల్లని వాతావరణం కారణంగా నీరు తక్కువగా తాగడం కూడా జట్టు కుదుళ్లు బలహీనంగా మారడానికి కారణం అవుతుంది. అయితే వర్షాకాలంలో జుట్టు రాలిపోకుండా ఉండటానికి 7ఆహారాలు సూపర్ ఫుడ్స్ గా పనిచేస్తాయి(Hair fall reduce foods). చాలా సులువుగా మనకు లభ్యమయ్యే ఈ ఆహారాలేవో తెలుసుకుంటే..

పాలకూర..(Spinach)

పాలకూరలో విటమిన్ ఎ,సి, ఐరన్, ఒమేగా-3ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పాలకూరను సూప్ గానూ తీసుకోవచ్చు. లేదా ఇతర మార్గాలలోనూ తీసుకోవచ్చు. ఇది జుట్టు కుదుళ్ళను బలంగా మారుస్తుంది. జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.

కాయధాన్యాలు..(Lentils)

కాయధాన్యాలలో అందరికీ చిక్కుళ్లు, శనగలు, బీన్స్, పెసలు, బొబ్బర్లు, బఠానీ, ఇలా చాలా తెలిసే ఉంటాయి. వీటిని వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే జుట్టును బలంగా మారుస్తాయి. వీటిలో ఐరన్, జింక్, బయోటిన్, ప్రోటీన్, విటమిన్-B, విటమిన్-C మొదలైనవి సమృద్దిగా ఉంటాయి. ఇవి జుట్టును దృఢంగా మారుస్తాయి.

Heavy Rains Effect: అమ్మ బాబోయ్.. వర్షాల ప్రభావం ఈ రేంజ్‌లో ఉందేంటి..? రోడ్డు మీదకు వచ్చిన మొసలి ఏం చేస్తోందంటే..!


వాల్నట్స్..(Walnuts)

మెదడు ఆకారంలో ఉండే వాల్నట్స్ బ్రెయిన్ ఫుడ్ గా పేరొందాయి. వాల్నట్స్ లో బయోటిన్, విటమిన్-B1,B6,B9, విటమిన్-E, మెగ్నీషియం, ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి జుట్టు క్యూటికల్స్ ను బలోపేతం చేస్తాయి. తద్వారా జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తాయి.

పెరుగు..(curd)

పెరుగులో విటమిన్-B5, విటమిన్-D ఉంటాయి. ఇవి హెయిర్ ఫోలికల్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. వర్షాకాలంలో పెరుగులో గుడ్డు, తేనె లేదా నిమ్మకాయ కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. మజ్జిగను ఆహారంలో తీసుకోవాలి. ఇలా చేస్తే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది.

ఓట్స్..(oats)

ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం ఆరోగ్యానికే కాదు,జుట్టుకు కూడా ఎంతో మంచిది. ఓట్స్ లో ఫైబర్, జింక్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లు ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రేరేపించే పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీ..(strawberry)

స్ట్రాబెర్రీలలో అధిక మొత్తంలో సిలికా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఒక మినరల్ గా సిలికా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలను ఆహారంలో తీసుకుంటే జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

చిలగడదుంప..(sweet potato)

చిలగడ దుంపలలో బీటాకెరోటిన్ సమృద్దిగా ఉంటుంది. జుట్టు పెరుగుదల గ్రంథులను ఇది ప్రేరేపిస్తుంది. చిలగడదుంపలను రెగులర్ గా ఆహారంలో తీసుకుంటే వాడిపోయి, పలుచబడి, విరిగిపోయే జుట్టును తిరిగి ఆరోగ్యంగా మారుస్తుంది.

Viral: జాబ్ కోసం ఇంటర్వ్యూకు వచ్చిన ఓ కుర్రాడి కండీషన్స్ విని అవాక్కైన రిక్రూటర్.. భవిష్యత్తులో ఇలాగే ఉంటుందంటూ..!


Updated Date - 2023-07-21T16:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising