ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Video: భగవంతుడా.. ఈ తల్లికి ఏంటీ శిక్ష..? సరిగ్గా నిలబడలేదు కానీ కొడుకును మోసుకుంటూనే..!

ABN, First Publish Date - 2023-11-08T21:00:22+05:30

పిల్లలను నవమాసాలు మోసి కని పెంచుతుంది తల్లి. అంతటితో తన బాధ్యత తీరిపోయిందని అనుకోకుండా పిల్లలు పెద్దవాళ్లై.. కోడళ్లు, మనువళ్లు వచ్చినా అందరిపై అదే ప్రేమానురాగాలను కురిపిస్తుంది. తాను ఇబ్బంది పడినా తన పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే ..

పిల్లలను నవమాసాలు మోసి కని పెంచుతుంది తల్లి. అంతటితో తన బాధ్యత తీరిపోయిందని అనుకోకుండా పిల్లలు పెద్దవాళ్లై.. కోడళ్లు, మనువళ్లు వచ్చినా అందరిపై అదే ప్రేమానురాగాలను కురిపిస్తుంది. తాను ఇబ్బంది పడినా తన పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే తల్లిని మించిన దైవం లేదని పెద్దలు అంటూ ఉంటారు. తల్లి ప్రేమను గుర్తు చేస్తూ తరచూ పలు రకాల సంఘటనలు మన కళ్లముందు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా నిలబడలేని తల్లి.. తన కొడుక్కు ఏ కష్టం రాకుండా మోసుకుంటూ భిక్షాటన చేయడం చూసి అంతా చలించిపోతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. వికలాంగురాలైన ఓ తల్లి (disabled mother) నడవలేని స్థితిలో ఉంటుంది. అయినా తన కొడుకును బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో భిక్షాటన చేస్తుంటుంది. అయితే తన కొడుకు ఇంటి వద్ద ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందో ఏమో అనుకుని.. తనతో పాటే తీసుకొచ్చింది. నడిస్తే ఎక్కడ తన కొడుక్కి కష్టం కలుగుతుందో అనే ఉద్దేశంతో (mother begging with her son sitting on her) తన వీపు మీద కూర్చోబెట్టుకుంది. కిందపడకుండా బాలుడిని తాడుతో కట్టుకుంటుంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమె.. కర్ర సాయంతో కుంటుకుంటూ నడుస్తూనే కొడుకును మోసుకుంటూ వెళ్తుంది.

Shocking Video: చెల్లి మృతదేహాన్ని చున్నీతో కట్టుకుని.. బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లిన అన్న..!

తల్లి పైన కూర్చున్న కొడుకు పుచ్చకాయ తింటూ ఉండగా.. మహిళ ఇబ్బంది పడుతూనే రోడ్డపై భిక్షాటన చేస్తూ కనిపించింది. ఆమెను చూసిన వారంతా చలించిపోయారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వాగానికి గురవుతున్నారు. ‘‘తల్లిని మించిన దైవం లేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి కష్టం ఏ తల్లికీ రాకూడదు’’.. అంటూ మరికొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Video: ఈ కుర్రాడెవరో కానీ.. కడుపుబ్బా నవ్వించేశాడుగా.. మెట్రో‌ రైల్లో ఇద్దరి మధ్య కూర్చుని సడన్‌గా షాకిచ్చాడు..!

Updated Date - 2023-11-08T21:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising