Shocking: ఏడాదిన్నర వయసున్న పాప.. ఎంతకూ ఏడుపు ఆపడం లేదని ఆ తల్లి చేసిన నిర్వాకమిదీ.. పాల బాటిల్లో..!
ABN, First Publish Date - 2023-08-10T16:18:07+05:30
తల్లి అనే పిలుపు కోసం తపించే మహిళలు.. పిల్లలు పుట్టిన తర్వాత వారే ప్రపంచంగా బతుకుతారు. పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరిస్తుంటారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తల్లి మాత్రం ...
తల్లి అనే పిలుపు కోసం తపించే మహిళలు.. పిల్లలు పుట్టిన తర్వాత వారే ప్రపంచంగా బతుకుతారు. పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వ్యవహరిస్తుంటారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తల్లి మాత్రం తమ పిల్లలకు కలలో కూడా హాని కలిగించదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లి మాత్రం.. ఆ స్థానానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించింది. ఎంతకూ ఏడుపు ఆపడం లేదని.. ముక్కు పచ్చలారని పాప అని కూడా చూడకుండా చివరకు ఏం చేసిందంటే..
అమెరికా కాలిఫోర్పియాలోని (America California) లాస్ ఏంజెల్స్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రియాల్టో సమీపంలో నివాసం ఉంటున్న 37 ఏళ్ల హానెస్టీ డి లా టోర్రే అనే మహిళ తల్లి స్థానానికే కలంకం తెచ్చేలా ప్రవర్తించింది. ఈమెకు ఏడాదిన్నర పాప ఉంది. ఇదిలావుండగా, శనివారం రాత్రి సదరు మహిళ.. కారులో బయటికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే అదే సమయంలో ఆమె పాప ఏడుపు (crying baby) మొదలెట్టింది. ఎంత ఓదార్చినా ఏడుపు మాత్రం ఆపలేదు. దీంతో తల్లికి తీవ్రమైన కోపం వచ్చింది. బయటికి వెళ్లేందుకు ఆలస్యం అవుతుండడంతో చివరకు దారుణమైన నిర్ణయం తీసుకుంది. పాల సీసాలో (alcohol Mixing in milk bottle) మద్యం కలిపి పాపకు పట్టించింది.
Viral Video: బాబోయ్.. ఇదేం బైక్రా నాయనా..? ట్రాక్టర్ టైరును తీసుకొచ్చి బండికి తగిలించారుగా..!
అయితే ఆ పాలు తాగిన కొద్ది సేపటికి చిన్నారి పరిస్థితి విషమించింది. చివరకు భయంతో కూతుర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు చివరకు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈమె నిజంగా తల్లేనా’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలా చేయడానికి మనసు ఎలా వచ్చిందమ్మా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-10T16:18:07+05:30 IST