ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నీ మర్చిపోదాం.. ఇంటికి రండని పిలిస్తే.. ప్రేమ పెళ్లయిన 4 ఏళ్లకు భార్యతో సహా ఇంటికి వెళ్లాడా భర్త.. 10 రోజుల తర్వాత..

ABN, First Publish Date - 2023-04-12T13:21:31+05:30

తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ప్రేమించుకోవడం. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం సహజంగా జరుగుతుంటాయి. ఆ జంట కూడా అలానే పెళ్లి చేసుకుని పెద్దలకు దూరంగా సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో

love marriage
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ప్రేమించుకోవడం. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం సహజంగా జరుగుతుంటాయి. ఆ జంట కూడా అలానే పెళ్లి చేసుకుని పెద్దలకు దూరంగా సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమ్మలా ఆదరించాల్సిన ఆమెనే రాక్షసురాలిగా మారింది. భక్తి ముసుగులో కిరాతుకురాలిగా మారింది. చివరికి అనుకున్నంత పని చేసింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఏ ఆడబిడ్డైనా వివాహం అయ్యాక పుట్టినింటిని వదిలిపెట్టి.. మెంటి నింటిల్లో అడుగుపెడుతుంది. ఇక అత్తగారిల్లే సర్వస్వం అనుకుంటారు. అత్తలు కూడా అలానే ఆదరిస్తే ఆ కుటుంబం సుఖసంతోషాలతో ముందుకు సాగిపోతుంది. అత్తలుగా మారినవాళ్లు ఒకప్పుడు వాళ్లు కూడా కోడలిగా వచ్చిన వారే. ఆ విషయం మరిచిపోకూడదు.

నాలుగేళ్ల క్రితం వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలా నాలుగేళ్లు అందరికీ దూరంగా హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఇంతలో అబ్బాయి తల్లిదండ్రులు.. అందరం కలిసుందాం? రండి అంటూ ఇద్దర్నీ ఇంటికి ఆహ్వానించారు. 10 రోజులు బాగానే ఉన్నట్టు నటించారు. కానీ లోపల మాత్రం పగ అలానే ఉండి పోయింది. లోలోపల కోడలిపై ద్వేషంతో రగిలిపోతున్న అత్తగారు(Mother in law).. భక్తి ముసుగులో గుడికి వెళ్దామంటూ నమ్మించి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా చంపేసింది. ఈ దారుణ సంఘటన బీహార్‌ (Bihar)లో చోటుచేసుకుంది.

బీహార్‌లోని పానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధనుక గ్రామ శివారులో 15 రోజుల క్రితం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో చందా గ్రామానికి చెందిన నితీష్‌కుమార్ భార్య పూజాకుమారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా పూజాను ఆమె అత్తే హత్య చేసినట్లుగా తేల్చారు. దీంతో నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

నాలుగేళ్ల క్రితం ( four year) నితీష్.. పూజా ప్రేమించి పెళ్లి (love marriage) చేసుకున్నారు. ఈ పెళ్లి అబ్బాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో వేరే చోట నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల నితీష్ కుటుంబ సభ్యులు.. అతనితో పాటు పూజాను ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి రాగానే అత్త గారు చాలా ఆప్యాయంగా పలకరించి మాట్లాడింది. దీంతో పూజా కూడా పాత విషయాలు ఏమీ జ్ఞాపకం పెట్టుకోకుండా అత్త గారు బాగానే ఉందని నమ్మింది. అయితే ఒక రోజు కుమారుడికి (son) అనుమానం రాకుండా స్నేహితులతో కలిసి గుడికి తీసుకెళ్తున్నట్లు పూజాను అత్తగారు బయటకు తీసుకెళ్లింది.

కోడలిపై (daughter in law) కోపంతో రగిలిపోతున్న అత్త.. ధనుక గ్రామంలో పూజాను చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేసింది. భార్య ఎక్కడకెళ్లిందంటూ నితీష్.. అన్ని చోట్ల వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 10 రోజుల తర్వాత కాలువలో పూజా మృతదేహాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ పెళ్లి కారణంగా ఇంట్లో వాళ్లు ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తే అత్తే చంపినట్లు నిగ్గుతేల్చారు. దీంతో ఆమె బండారం బట్టబయలైంది. అమ్మలా ఆదరించాల్సిన ఆమెనే రాక్షసురాలిగా మారి పొట్టనపెట్టుకుంది.

ఇది కూడా చదవండి: Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!

ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..

ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

Updated Date - 2023-04-12T13:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising