ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పీటలపై వధూవరులు.. కూతురు పక్కనుండగానే అల్లుడి నోట్లో సిగరెట్ పెట్టిన అత్త.. నెట్టింట ఫన్నీ రియాక్షన్స్..!

ABN, First Publish Date - 2023-02-16T15:52:30+05:30

పెళ్లి సంబంధాల విషయంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దల మాట. ఇక పెళ్లి చూపుల్లో అయితే.. అబ్బాయికి ఏవేం అలవాట్లు ఉన్నాయి.. ముఖ్యంగా బీడీ, సిగరెట్, మందు.. ఇలా దురలవాట్లు ఏమైనా ఉన్నాయా.. అంటూ అమ్మాయి తరపువారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి సంబంధాల విషయంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దల మాట. ఇక పెళ్లి చూపుల్లో అయితే.. అబ్బాయికి ఏవేం అలవాట్లు ఉన్నాయి.. ముఖ్యంగా బీడీ, సిగరెట్, మందు.. ఇలా దురలవాట్లు ఏమైనా ఉన్నాయా.. అంటూ అమ్మాయి తరపువారు పదే పదే ఎంక్వయిరీలు చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే.. పెళ్లి తర్వాత తమ కూతురు భవిష్యత్ ఎక్కడ నాశనం అవుతుందో.. అని తల్లిదండ్రులు ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లిలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. పెళ్లి వేదికపై కూతురు పక్కన ఉండగానే.. అత్త అల్లుడి నోట్లో సిగరెట్ పెట్టగా.. మామ వెలిగించడం.. అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో... నెట్టింట వైరల్‌గా మారింది...

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఓ వీడియో (Wedding viral videos) తెగ వైరల్ అవుతోంది. వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై.. వివాహ వేదికపై కూర్చుని ఉంటారు. ఇంతలో వరుడి అత్తమామలతో పాటూ మరికొందరు బంధువులు నిలబడి ఉంటారు. ఇంతలో మామ జేబు నుంచి ఓ సిగరెట్ (Cigarette) తీసి, అత్తకు ఇస్తాడు. తర్వాత అత్త (mother-in-law) ఆ సిగరెట్‌ని ఎంతో ప్రేమగా అల్లుడి నోట్లో పెడుతుంది. అనంతరం మామ.. సిగరెట్‌కి నిప్పంటిస్తాడు. అయితే వరుడు.. తనకు ఇష్టం లేకున్నా.. తప్పదు అన్నట్లుగా సిగరెట్ కాల్చడాన్ని గమనించవచ్చు.

రైల్లోంచి ప్రయాణీకులంతా దిగినా ఎవరూ తీసుకెళ్లని ట్రంకు పెట్టె.. కిందకు దించి తాళాలు పగలగొడితే లోపల కనిపించిన దృశ్యం చూసి..!

అయితే అసలు విషయంలోకి వెళ్తే.. దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో వివాహ సమయంలో అత్తమామలు.. అల్లుడికి సిగరెట్ అంటించడం ఓ ఆచారంగా (custom) కొనసాగుతోందట. అబ్బాయిలకు సిగరెట్ అలవాటు ఉన్నా, లేకున్నా.. పెళ్లిలో మాత్రం కాల్చడం సాంప్రదాయంగా వస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఆహా.. మాకూ ఇలాంటి అత్తమామలు ఉంటే.. ఎంత బాగుంటుంది.. అంటూ కొందరు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది.

Viral Video: మహా అయితే పిల్ల పాము ఉంటుందనుకున్నారు.. చివరకు అష్టకష్టాలు పడి ఇంటి సీలింగ్‌ బద్దలు కొట్టి చూడగా..

Updated Date - 2023-02-16T15:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising