Mother: ఏం తల్లివమ్మా.. పుట్టిన మర్నాడే ఇద్దరు పిల్లల్ని చంపి ఫ్రీజర్‌లో దాచేసింది.. భర్తకు కూడా తెలియకుండా..!
ABN, First Publish Date - 2023-06-23T20:56:51+05:30
పిల్లలను కంటికి రెప్పలా కాపాడటంలో తల్లి పాత్ర ఎంతో ఉంటుంది. పిల్లల సంతోషమే తన సంతోషంగా బతుకుతుంది. అలాంటి తల్లులు ఉన్న ఈ సమాజంలో పిల్లల పట్ల రాక్షసత్వంగా ప్రవర్తించే తల్లులు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన మళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా...
పిల్లలను కంటికి రెప్పలా కాపాడటంలో తల్లి పాత్ర ఎంతో ఉంటుంది. పిల్లల సంతోషమే తన సంతోషంగా బతుకుతుంది. అలాంటి తల్లులు ఉన్న ఈ సమాజంలో పిల్లల పట్ల రాక్షసత్వంగా ప్రవర్తించే తల్లులు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన మళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా, ఓ తల్లి చేసిన దారుణానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పుట్టిన మర్నాడే ఇద్దరు పిల్లల్ని చంపి ఫ్రీజర్‌లో దాచేసింది. భర్తకు తెలీకుండా దాచినా చివరకు ఎలా వెలుగులోకి వచ్చిందంటే..
దక్షిణ కొరియాలోని (South Korea) సియోల్ పరిధి సువాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 30ఏళ్ల మహిళకు (woman) 8, 10, 12 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో పిల్లల పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో ఈమె 2018 నవంబర్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే కూతురు పుట్టిందన్న ఆనందం ఆమెకు ఏమాత్రం లేదు. ఎందుకంటే అప్పటికే ముగ్గురు పిల్లల పోషణ భారంగా మారడంతో నాలుగో సంతానాన్ని ఎలా పోషించాలి అనే దిగులు పట్టుకుంది. ఈ క్రమంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. శిశువు జన్మించిన మరుసటి రోజే గొంతు (mother killed her baby) నులిమి చంపి, మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచింది.
అనంతరం 2019 నవంబర్‌లో ఐదవ సంతానంగా మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఇప్పుడు కూడా ఆమెకు ఇసుమంత ఆనందం కూడా లేదు. ఎలాగైనా ఈ సంతానాన్ని కూడా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పిల్లాడిని కూడా అదే విధంగా చంపి దాచేసింది. ఈ విషయం భర్తకు తెలీకుండా దాచి పెట్టింది. రెండు సార్లు అబార్షన్ (Abortion) చేయించుకున్నానని చెప్పడంతో భర్తకు అనుమానం కలగలేదు. అయితే ఇటీవల ఆడిట్ సందర్భంగా ప్రభుత్వ అధికారులు (Government officials) విచారించగా.. ఆస్పేత్రిలో సదరు మహిళకు పిల్లలు జన్మించినట్లుగా నమోదై ఉంది. జూన్‌లో పోలీసులు మహిళ ఇంట్లో సోదాలు నిర్వహించి, విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నేరం అంగీకరించడంతో నిందితురాలిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
Updated Date - 2023-06-23T20:56:51+05:30 IST