ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: ఆ తల్లి చేసిన పొరపాటే.. 11 ఏళ్ల కూతురి పాలిటి శాపమయింది.. 40 ఏళ్ల వ్యక్తితో ఆ బాలిక పెళ్లి జరగడం వెనుక..!

ABN, First Publish Date - 2023-05-02T10:33:47+05:30

బీహార్‌లో (Bihar) దారుణ ఘటన వెలుగు చూసింది. 40 ఏళ్ల వ్యక్తితో 11 ఏళ్ల మైనర్ బాలిక (Minor Girl) పెళ్లి జరిగిన విషయం బయటకు వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లో (Bihar) దారుణ ఘటన వెలుగు చూసింది. 40 ఏళ్ల వ్యక్తితో 11 ఏళ్ల మైనర్ బాలిక (Minor Girl) పెళ్లి జరిగిన విషయం బయటకు వచ్చింది. ఆమె తల్లి చేసిన పొరపాటు..11 ఏళ్ల కూతురి పాలిట శాపంగా మారింది. అభం, శుభం తెలియని ఆ మైనర్‌ను నరకంలోకి నెట్టేసింది. హాయిగా ఆడుతూపాడుతూ గడపాల్సిన వయసులో ఊహించని మలుపు తిరిగిందా చిన్నారి లైఫ్. ఆమె తల్లి చేసిన పొరపాటుకు ఇలా బాలిక బలయింది. ఇంతకీ ఆ తల్లి చేసిన పొరపాటు ఏంటి? అసలు 11 ఏళ్ల బాలికకు ఈ పరిస్థితి ఎలా దాపురించింది? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని సివాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక లక్ష్మీపూర్ గ్రామంలో ఓ కుటుంబం తన దూరపు బంధువైన మహేంద్ర పాండే వద్ద రూ. 2 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే, ఆ కుటుంబం తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో దాన్ని మహేంద్రపాండే అవకాశంగా తీసుకున్నాడు. వారికి ఓ 11 ఏళ్ల కూతురు ఉండడంతో అతడి కన్ను ఆ బాలికపై పడింది. ఆమెను తనకు ఇచ్చి పెళ్లి (Marriage) చేస్తే, మీ బాకీ మాఫీ చేస్తానని చెప్పాడు. పెళ్లి తర్వాత ఆమెను చదివిస్తానంటూ నమ్మబలికాడు. ఇక అప్పు తీర్చే మార్గంలేని బాలిక తల్లి.. కుమార్తెను అతడితో పంపించేసింది.

Viral Video: కారు డిక్కీ డోర్‌ను తీసేసి.. ఇనుప చువ్వలు అడ్డుగా పెట్టి.. ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!

బాలికను తీసుకెళ్లి మహేంద్ర పెళ్లి చేసుకున్నాడు. అయితే, మూడు నెలల తర్వాత.. తన కూతురును ట్రాప్ చేసి, పెళ్లి చేసుకున్నాడని తల్లి (Mother) పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు మహేంద్ర పాండేను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆ బాలిక ఇందులో మహేంద్ర తప్పేమీ లేదని, చేసిన అప్పులు తీర్చలేక తన తల్లే అతడిని పెళ్లి చేసుకోమని ఒప్పించిందని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.

Love Marriage: ఈ ప్రేయసి పంతం నెగ్గిందిగా.. పెళ్లి వద్దని ప్రియుడు పారిపోతున్నా.. ఆ ప్రేయసి 4 సార్లు వెతికి పట్టుకుని మరీ..

ఇదే విషయమై మహేంద్ర మాట్లాడుతూ, తల్లి ఇష్టప్రకారమే తామిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. కొంత కాలానికి డబ్బుల కోసం తమను బ్లాక్ మెయిల్ చేసిందంటూ చెప్పుకొచ్చాడు. ఆమె అడిగిన డబ్బు ఇవ్వకపోడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నాడు. అలాగే బాధిత బాలిక సైతం తల్లికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వడం గమనార్హం. అయితే, 3నెలలుగా బాలిక అతడి వద్దే ఉండటంతో ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

tuni train incident: సంచలన కేసులో విజయవాడ రైల్వే కోర్ట్ తీర్పు.. ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాలపై కేసు కొట్టివేత

Updated Date - 2023-05-02T10:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising