Mother Risk: అమ్మ బాబోయ్.. నువ్వు చేసిన రిస్క్‌కు హ్యాట్సాఫ్ తల్లీ.. నలుగురు పిల్లల్ని ఎలా కాపాడుకుందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-07-20T19:42:30+05:30
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి మరోటి ఉండదు. పిల్లల సంక్షేమమే తన ధ్యేయంగా.. వారి ఇష్టాలే తన ఇష్టంగా బతుకుతుంది. తన పిల్లలు ఏడాదికేడాది ఎదుగుతూ ఉంటే.. చూసి సంతోషిస్తూ ఉంటుంది. పొరపాటున వారికి చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేదు. అవసరమైతే తన ప్రాణాలను ఫణంగా పెట్టి వారిని రక్షించుకుంటుంది. ఇందుకు నిదర్శనంగా...
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి మరోటి ఉండదు. పిల్లల సంక్షేమమే తన ధ్యేయంగా.. వారి ఇష్టాలే తన ఇష్టంగా బతుకుతుంది. తన పిల్లలు ఏడాదికేడాది ఎదుగుతూ ఉంటే.. చూసి సంతోషిస్తూ ఉంటుంది. పొరపాటున వారికి చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేదు. అవసరమైతే తన ప్రాణాలను ఫణంగా పెట్టి వారిని రక్షించుకుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు, ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇంట్లో నలుగురు పిల్లలు ఆడుకుంటూ ఉండగా.. సీలింగ్ కూలిపోవడాన్ని తల్లి గమనించింది. దీంతో తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి వారిని కాపాడుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘నువ్వు చేసిన రిస్క్‌కు హ్యాట్సాఫ్ తల్లీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కంబోడియాలోని (Cambodia) నమ్ పెన్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ (woman) తన ఇంట్లో తన నలుగురు పిల్లలను ఆడిస్తూ ఉంటుంది. వారిలో చిన్న పిల్లోడు వాకర్‌లో కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఇంతలో తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి బయటకు వెళ్తూ ఉంటుంది. అయితే అంతలో ఆమెకు ఇంటి పైన ఏదో శబ్ధం వినిపిస్తుంది. వెనక్కు తిరిగి చూడగా.. ఇంటి సీలింగ్ దాదాపు కూలిపోయే స్థితిలో ఉంటుంది. దీంతో ఆమె ఒక్కసారిగా అలెర్ట్ అవుతుంది. తన చిన్న కొడుకు వాకర్‌లో ఉన్న విషయం గుర్తుకొచ్చి.. పరుగు పరుగున వెనక్కు వచ్చి, పిల్లాడు కూర్చున్న వాకర్‌ను లాక్కుని వెళ్తుంది.
వారు అలా వెళ్లగానే ఒక్కసారిగా సీలింగ్ (house ceiling collapsed) ఊడి ధమేల్‌మని కిందపడుతుంది. తల్లి అప్రమత్తంగా వ్యవహరించడంతో (mother saved her son) కొడుకును కాపాడుకోగలిగింది. ఒక్క క్షణం ఆలస్యం అయ్యున్నా.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ తల్లికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘ఎంత పెద్ద ప్రమాదం తప్పింది’’.. అని ఇంకొందరు, ‘‘పాత ఇళ్లల్లో ఉన్న వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి‘‘.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-20T19:42:30+05:30 IST